Hair Care : అందమైన జుట్టుకు మాస్క్‌లు
ABN , Publish Date - Dec 23 , 2023 | 11:18 PM
చలికాలంలో చర్మం మాదిరిగానే జుట్టు కూడా త్వరగా పాడవుతుంది. జుట్టు రాలిపోవటం, చుండ్రు లాంటి సమస్య పెరుగుతాయి. ఇలాంటి సమస్యల నుంచి జుట్టును ..
చలికాలంలో చర్మం మాదిరిగానే జుట్టు కూడా త్వరగా పాడవుతుంది. జుట్టు రాలిపోవటం, చుండ్రు లాంటి సమస్య పెరుగుతాయి. ఇలాంటి సమస్యల నుంచి జుట్టును రక్షించుకోవటానికి ఇంట్లో సులభంగా తయారుచేసుకొనే కొన్ని హెయిర్ మాస్క్‌లను చూద్దాం.
ఆలివ్ నూనెతో..
ఆలివ్ ఆయిల్‌ను రెండు నిమిషాల పాటు వేడి చేయాలి. గోరు వెచ్చని ఆలివ్ ఆయిల్‌ను జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. రాత్రి నిద్రపోయే ముందు ఆలివ్‌నూనెను పట్టించి ఉదయాన్నే జుట్టును శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే జుట్టు సమస్యలు పోతాయు.
తేనెతో
ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ల తేనెను తీసుకుని అందులోకి కోడిగుడ్డులోని పచ్చసొనను వేసి మిశ్రమంగా కలపాలి. దాంతో జుట్టుకు అరగంటపాటు మర్దనా చేయాలి. తర్వాత శుభ్రంగా కడిగేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.
అలొవిరాతో
అలొవిరా ఆకుల నుంచి జెల్‌ను తయారు చేసుకుని అందులోకి నిమ్మరసం, ఆలివ్‌నూనె., కొబ్బరినూనెలను ఒక టేబుల్ స్పూన్ చొప్పున కలపాలి. దీన్ని మిశ్రమంగా కలిపి జుట్టుకు కుదుళ్ల దాకా పట్టించి అరగంట తర్వాత శుభ్రపరిస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది.
పెరుగుతో
ఒక కప్పులో ఒక కోడిగుడ్డు సొనను వేసి దానిలో నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పేస్ట్‌లా పూయాలి. బాగా ఆరిన తర్వాత దీనిని చల్లటి నీటితో కడగాలి.