Good Food : మరాఠీ మొగ్గతో లాభాలెన్నో

ABN , First Publish Date - 2023-01-31T00:17:09+05:30 IST

బిరియానీ వాడుకునే మరాఠీ మొగ్గతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటంటే...

Good Food : మరాఠీ మొగ్గతో లాభాలెన్నో

బిరియానీ వాడుకునే మరాఠీ మొగ్గతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటంటే...

  • ప్రమాదకరమైన ఫ్రీ ర్యాడికల్స్‌ నుంచి మరాఠీ మొగ్గలోని యాంటీఆక్సిడెంట్లు రక్షణ కల్పిస్తాయి. ఇలా ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గించుకోగలిగితే, తీవ్ర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

  • రక్తంలో అధిక చక్కెరలు ఆరోగ్యానికి ఎంత హానికరమో మనందరికీ తెలిసిందే. మరాఠీ మొగ్గలో చక్కెరను అదుపులో ఉంచే పోషకాలుంటాయి.

  • ఎన్నో రకాల బ్యాక్టీరియాలకు అడ్డుకట్ట వేసే యాంటీబ్యాక్టీరియల్‌ సుగాణాలు మరాఠీ మొగ్గలో ఉంటాయి.

  • మరాఠీ మొగ్గ నుంచి తీసిన నూనెను వ్యాఽధినిరోధకశక్తి పెంపుకు ఉపయోగించుకోవచ్చు. అలాగే కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది.

  • దీనిలోని బయోయాక్టివ్‌ కాంపౌండ్లు ఫంగల్‌, బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.

Updated Date - 2023-01-31T00:17:20+05:30 IST