Kitchen tips : వంటింటి చిట్కాలు

ABN , First Publish Date - 2023-08-02T23:36:37+05:30 IST

పుదీనా పచ్చడి చేసేప్పుడు పెరుగు కలిపితే రుచిగా ఉంటుంది. బియ్యం కడిగిన నీటిలో కోడిగుడ్లను ఉడకబెడితే పెంకులు సులువుగా వస్తాయి.

 Kitchen tips : వంటింటి చిట్కాలు

  • పుదీనా పచ్చడి చేసేప్పుడు పెరుగు కలిపితే రుచిగా ఉంటుంది.

  • బియ్యం కడిగిన నీటిలో కోడిగుడ్లను ఉడకబెడితే పెంకులు సులువుగా వస్తాయి.

  • కూరల్లో పులుపు తక్కువగా ఉంటే మామిడి పొడితో కొంచెం పెరుగుకలిపి కూరలో వేస్తే టమోటా రుచి వస్తుంది.

  • వెక్కిళ్లు వస్తుంటే చల్లనీళ్లు తాగాలి. లేదా ఎక్కిళ్లు వచ్చే వ్యక్తి దృష్టిని మరల్చినా పోతాయి.

  • బ్రెడ్‌ ప్యాకెట్‌లో బంగాళదుంపలు ముక్కలు ఉంచితే బ్రెడ్‌ త్వరగా పాడవదు.

  • వంటింట్లో బొద్దింకల బెడద తగ్గిపోవాలంటే బోరిక్‌ పౌడర్‌ను మూలల్లో చల్లాలి.

  • కూరల్లో ఉప్పు ఎక్కువైతే కొబ్బరి ముక్క లేదా టమోటా ముక్కలు వేస్తే సరి.

  • బౌల్స్‌, జ్యూస్‌ జార్స్‌లో వాసన వస్తోంటే ఉప్పులో కొద్దిగా నీళ్లుపోసి ఆ మిశ్రమాన్ని రుద్దాలి. ఆ తర్వాత ధారగా వచ్చే ట్యాప్‌ నీళ్లతో శుభ్రం చేయాలి.

  • ఫ్రిజ్‌లో పుదీనా ఆకులు ఉంచితే ఫ్రిజ్‌లో దుర్వాసన పోతుంది.

Updated Date - 2023-08-02T23:36:45+05:30 IST