వంటింటి చిట్కాలు
ABN , First Publish Date - 2023-05-25T00:05:04+05:30 IST
పట్టుచీరలు ఉతికేప్పుడు బకెట్‌లో కొద్దిగా నిమ్మరసం వేయటం వల్ల రంగుపోవు...

పట్టుచీరలు ఉతికేప్పుడు బకెట్‌లో కొద్దిగా నిమ్మరసం వేయటం వల్ల రంగుపోవు.
గుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడకబెడితే పెంకులు త్వరగా ఊడిపోతాయి. పండిన టమోటాలను ఉప్పునీళ్లలో వేస్తే త్వరగా పాడవవు.
కారంపొడి డబ్బాలో ఇంగువ ముక్క వేసే కారానికి పురుగులు పట్టవు.
ఎండాకాలం పాలు ఇరిగిపోకుండా ఉండాలంటే.. పళ్లెంలో నీళ్లు పోసి దానిమీద ఆ పాలగిన్నెను ఉంచాలి.
చిన్న కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే పెరుగు త్వరగా పాడవదు.
సాధారణంగా ప్లాస్క్‌లు ఒకరకమైన వాసన వస్తుంటాయి. ఎంత కడిగినా అదే దుర్వాసన వస్తోంటే మాత్రం మజ్జిగతో లేదా నిమ్మరసం వేసి శుభ్రం చేయాలి. అప్పుడు ఆ వాసన
తగ్గిపోతుంది.