King-monkey : రాజు-కోతి
ABN , First Publish Date - 2023-04-06T23:47:33+05:30 IST
ఒక రాజ్యంలో ఒక రాజుండేవాడు. అతనికి జంతువులంటే ప్రాణం. వాటిని వేటాడటానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఒక రోజు తన నందనవనంలోకి ఓ కోతి వచ్చింది.
ఒక రాజ్యంలో ఒక రాజుండేవాడు. అతనికి జంతువులంటే ప్రాణం. వాటిని వేటాడటానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఒక రోజు తన నందనవనంలోకి ఓ కోతి వచ్చింది. బాగా ఆడుకుంది. రాజుగారి దగ్గరకు వెళ్లింది. దాన్ని చూసి ఆ రాజు ముచ్చటపడ్డాడు. ఆ మామిడి పండును తెంపమంటే.. వెంటనే తెంపేది. అది తెలివైన కోతి అని అర్థం చేసుకున్నాడు.
ప్రతిరోజు వనంలోకి వచ్చేది కోతి. రాజుగారికి కాలక్షేపం అయ్యేది. ఇద్దరూ స్నేహితులయ్యారు. కోతిని ఇష్టపడేవారు రాజు. అంతే రీతిలో కోతి కూడా రాజుగారంటే ఇష్టం. రాజుగారి మీద ఈగకూడా వాలకుండా కోతి చూసుకునేది. దీంతో అంగరక్షకుడి పాత్ర పోషిస్తున్నదని రాజుగారికి అర్థమైంది. ఇక తన రాజ్యంలోనే ఆ కోతికి సకల సదుపాయాలను ఏర్పాటు చేయించాడు. ఆ కోతికి అదృష్టం పట్టిందని జనాలనేవాళ్లు. కొన్నాళ్ల తర్వాత ఆ కోతికి ఓ ఖడ్గం ఇచ్చారు రాజుగారు. ఎందుకంటే.. తనకు నమ్మకమైన అంగరక్షకుడు కాబట్టి.
ఒక రోజు రాజుగారు నిద్రపోతున్నారు. కందిరీగ అటువైపు వచ్చింది. రాజుగారి మీద వాలబోయింది. కోతి దగ్గరకు వెళ్లి పక్కన ఉండే నెమలీకతో దాన్ని పారదోలింది. మళ్లీ క్షణాల్లో ఆ కందిరీగ వచ్చింది. అయితే దాన్ని రాజుకు కుట్టకుండా చంపేంత పని చేసింది. అది తప్పించుకుని మళ్లీ వచ్చింది. ఈసారి కోతికి కోపమొచ్చింది. ఆ కందిరీగ రాజుగారి ముక్కుమీద వాలింది. అంగరక్షకుడైన ఆ కోతి ఖడ్గంతో ఆ కందిరీగను చంపాలనుకుంది. ఖడ్గంతో కందిరీగను చంపేసింది. క్షణాల్లో రాజుగారి ముక్కు పైభాగం తెగిపోయింది. రాజుగారు నిద్రలేచి అరిచి గోలపెట్టారు. అయితే కోతి తప్పేమీ లేదని తన తప్పే ఉందని గ్రహించారు. ఆ కోతిని రాజ్యానికి దూరంగా తరిమేయమని భటులను ఆజ్ఞాపించారు.