Subhashitam : కార్య దీక్ష

ABN , First Publish Date - 2023-05-11T23:49:19+05:30 IST

ధైర్యవంతుల కార్య దీక్ష ఏ విధంగా ఉంటుందో భర్తృహరి తన నీతి శతకంలోని ఈ శ్లోకంలో వర్ణించాడు.

Subhashitam : కార్య దీక్ష

రత్నైర్మహాబ్ధే స్తుతుషుర్న దేవా

న భేజిరే భీమ విషేణ భీతిమ్‌

సుధాం వినా న ప్రరయుర్విరామం

న నిశ్చితార్థా ద్విరమంతి ధీరాః

ధైర్యవంతుల కార్య దీక్ష ఏ విధంగా ఉంటుందో భర్తృహరి తన నీతి శతకంలోని ఈ శ్లోకంలో వర్ణించాడు.

దాన్ని ఏనుగు లక్ష్మణకవి...

తనిసిరే వేల్పు లుదధి రత్నముల చేత?

వెఱచిరే ఘోర కాకోల విషము చేత?

విడిచిరే యత్న మమృతంబు వొడముదనుక?

నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు... అంటూ తెలుగువారికి అందించాడు.

‘‘దేవతలు అమృతం కోసం పాల సముద్రాన్ని మథిస్తున్నారు. దానిలోనుంచి రత్నాలు వచ్చాయి. వాటిని తీసుకొని సంతృప్తి చెందుదామని అనుకోలేదు. తరువాత కాలకూట విషం బయటికి వచ్చింది. దాన్ని చూసి వెనకడుగు వెయ్యలేదు. వారి లక్ష్యం అమృతాన్ని సాధించడం. ఆ లక్షం నెరవేరేదాకా క్షీరసాగర మథనాన్ని కొనసాగించారు. ధీరులైన వారు తాము నెరవేర్చాలనుకున్న కార్యాన్ని సాధించేవరకూ ప్రయత్నాన్ని వదిలిపెట్టరు’’ అని భావం.

Updated Date - 2023-05-11T23:49:19+05:30 IST