'Jurassic Park' actor Sam Neill : ‘జురాసిక్ పార్క్’ నటుడికి బ్లడ్ క్యాన్సర్
ABN , First Publish Date - 2023-03-19T00:28:55+05:30 IST
భారీ జంతువులు, రాకాసి బల్లులు చేసే హడావిడి, భయానక దృశ్యాలతో రూపొందిన హాలీవుడ్ చిత్రం ‘జురాసిక్ పార్క్’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకొని, రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది.

భారీ జంతువులు, రాకాసి బల్లులు చేసే హడావిడి, భయానక దృశ్యాలతో రూపొందిన హాలీవుడ్ చిత్రం ‘జురాసిక్ పార్క్’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకొని, రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. 1993లో ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత ఈ 30 ఏళ్ల కాలంలో ఈ సినిమాకు సంబంధించి ఆరు సీక్వెల్స్ వచ్చాయి. గత ఏడాది ఆరో సీక్వెల్ ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’ విడుదలైంది. ఇందులో అలెన్ గ్రాంట్ పాత్రను పోషించిన శామ్ నీల్ తనకు బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్లు ఇటీవల వెల్లడించారు. ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’ పబ్లిసిటీ టూర్‌లో ఉన్నప్పుడు ఈ వ్యాధి విషయం తనకు తెలిసిందనీ, ప్రస్తుతం మూడో స్టేజ్‌లో ఉందనీ ఆయన తెలిపారు.
‘డాక్టర్లు వ్యాధి విషయం చెప్పగానే ఏం చెయ్యాలో మొదట నాకు తోచలేదు. అయితే ఏదొకటి చేయాలి అని మాత్రం అనిపించి, నా కథనే పేపర్ మీద పెడితే బాగుంటుంది కదా అనుకున్నాను.. అందుకే నాకు కిమో థెరపి జరుగుతున్నప్పుడు ‘డిడ్ ఐ ఎవ్వర్ టెల్ యూ దిస్?’ పుస్తక రచన ప్రారంభించాను’ అని శామ్ చెప్పారు. ఈ పుస్తకం వచ్చే వారం విడుదల కానుంది.