Jabra Ear Buds : దేశీ మార్కెట్లోకి జెబ్రా ఇయర్‌ బడ్స్‌

ABN , First Publish Date - 2023-04-15T03:21:06+05:30 IST

జెబ్రా నుంచి ‘జెబ్రా ఎలైట్‌ 4 ట్రూ వైర్‌లెస్‌’ ఇయర్‌బడ్స్‌ ఇండియన్‌ మార్కెట్‌లోకి వచ్చాయి. యాక్టివ్‌ నాయిస్‌ కాన్సిలేషన్‌(ఏఎన్‌సీ) ఫీచర్‌ ఉంది.

Jabra Ear Buds : దేశీ మార్కెట్లోకి జెబ్రా ఇయర్‌ బడ్స్‌

జెబ్రా నుంచి ‘జెబ్రా ఎలైట్‌ 4 ట్రూ వైర్‌లెస్‌’ ఇయర్‌బడ్స్‌ ఇండియన్‌ మార్కెట్‌లోకి వచ్చాయి. యాక్టివ్‌ నాయిస్‌ కాన్సిలేషన్‌(ఏఎన్‌సీ) ఫీచర్‌ ఉంది. అనుచిత ధ్వనులను ఫిల్టర్‌ చేయగలుగుతుంది. దాంతో ప్యూర్‌ ఆడియో అనుభవం కలుగుతుంది. 4-మైక్రోఫోన్‌ కాల్‌ టెక్నాలజీ, 6ఎంఎం స్పీకర్స్‌ ఉండడంతో కాల్స్‌ సమయంలో సౌండ్‌ నాణ్యత బాగుంటుంది. అయిదున్నర గంటల సేపు ప్లేబ్యాక్‌ సింగిల్‌ చార్జింగ్‌తో లభిస్తుంది. వాటర్‌ రెసిస్టెంట్‌ డిజైన్‌తో రూపొందాయి. రెండేళ్ళ వారెంటీ ఉంది. ఐపీ55 రేటింగ్‌ ఉంది వాటర్‌ అలాగే స్వెట్‌ రెసిస్టెంట్‌ ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 6.0 ఆపైన, విండోస్‌ 10 ఆపైన వాటితో పనిచేస్తుంది. దీని ధర రూ.9,999. డార్క్‌గ్రే, నేవీ, లైలాక్‌, లైట్‌ బేగ్‌ రంగుల్లో ఇవి లభిస్తున్నాయి. అమెజాన్‌, ఫ్లిఫ్‌కార్ట్‌, క్రోమ్‌ దీని అధీకృత డీలర్లు.

Updated Date - 2023-04-15T03:21:06+05:30 IST