iPhone Lock ; ఐఫోన్‌ లాకైతే ఇలా చెయెుచ్చు

ABN , First Publish Date - 2023-08-26T00:17:43+05:30 IST

పాస్‌కోడ్‌ మర్చిపోతే... ఫేస్‌ ఐడీ కూడా పనిచేయకుంటే ఐఫోన్‌ పనిచేయదు. అంతమాత్రాన ఇబ్బందిపడనవసరం లేదు. నిర్దుష్ట పద్ధతుల్లో ఆ ఇబ్బంది నుంచి బైటపడవచ్చు.

 iPhone Lock ; ఐఫోన్‌ లాకైతే ఇలా చెయెుచ్చు

పాస్‌కోడ్‌ మర్చిపోతే... ఫేస్‌ ఐడీ కూడా పనిచేయకుంటే ఐఫోన్‌ పనిచేయదు. అంతమాత్రాన ఇబ్బందిపడనవసరం లేదు. నిర్దుష్ట పద్ధతుల్లో ఆ ఇబ్బంది నుంచి బైటపడవచ్చు.

మొదటి పద్ధతి

  • ఈ విధానంలో మేక్‌ లేదంటే పీసీ అవసరం అవుతుంది. పీసీ ఉపయోగిస్తున్న పక్షంలో విండోస్‌ 10కి అప్డేట్‌ అయి ఉండాలి. ఐట్యూన్స్‌ ఇన్‌స్టాల్‌ అయి ఉండాలి. కేబుల్‌తో ఐఫోన్‌కు కనెక్ట్‌ కావాలి.

  • మొదట ఐఫోన్‌ని టర్నాఫ్‌ చేయాలి. రికవరీ మోడ్‌ని ఎంటర్‌ చేసేందుకు ఫోర్స్‌తో రీస్టార్‌ చేయాలి. ఐఫోన్‌ 8 ఆ తరవాత వాటికి సైడ్‌ బటన్‌ని ప్రెస్‌ ఆపై హోల్డ్‌ చేయాలి. అదే ఎస్‌ఈ, ఐఫోన్‌ 6 ఆపై వాటికి హోమ్‌ బటన్‌ని ఉపయోగించుకోవాలి.

  • బటన్‌ని హోల్డ్‌ చేసినప్పుడు ఐఫోన్‌ని మేక్‌ లేదంటే విండోస్‌ పీసీకి కనెక్ట్‌ చేయాలి.

  • మేక్‌పై ఫైండర్‌ లేదంటే విండోస్‌ పీసీపై ఐట్యూన్‌ని ఓపెన్‌ చేయాలి.

  • ‘రిస్టోర్‌’ ఆప్షన్‌ని ఎంపిక చేసుకోవాలి. ఛాయిస్‌ని కన్‌ఫర్మ్‌ చేసుకుని ఆన్‌స్ర్కీన్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో కావాలి. అప్పుడు కంప్యూటర్‌లో రిస్టోర్‌ ప్రాసెస్‌ ఆరంభమవుతుంది.

  • లేటెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌తో ఐఫోన్‌ను అప్డేట్‌ చేయాలి. ఈ ప్రక్రియకు పదిహేను నిమిషాలు పడుతుంది. ఇదంతా పూర్తయితే ఐఫోన్‌ రీస్టార్‌ అవుతుంది. స్ర్కీన్‌ సెటప్‌ కనిపిస్తుంది. ఆప్పుడు కంప్యూటర్‌ నుంచి డిస్‌కనెక్ట్‌ కావాలి.

రెండో పద్ధతిలో

  • ఐఫోన్‌లో ‘ఫైండ్‌ మై ఫీచర్‌’ ఉంటే అన్‌లాక్‌ చేసుకునేందుకు ఐక్లౌడ్‌ను ఉపయోగించుకోవాలి.

  • మరోఫోన్‌ అంటే స్మార్ట్‌ఫోన్‌/టాబ్లెట్‌/కంప్యూటర్‌పై వెబ్‌బ్రౌజర్‌ని ఓపెన్‌ చేయాలి. ఐక్లౌడ్‌.కామ్‌/ఫైండ్‌/ని కనుగొనాలి.

  • యాపిల్‌ ఐడీ క్రెడెన్షియల్స్‌తో సైన్‌ అవ్వాలి.

  • ఆల్‌ డివైజెస్‌ని క్లిక్‌ చేయాలి. లాక్డ్‌ ఐఫోన్‌ని సెలెక్ట్‌ చేసుకోవాలి.

  • ‘ఎరేజ్‌ ఐఫోన్‌’ని పై క్లిక్‌ చేస్తే ప్రాసెస్‌ ఆరంభమవుతుంది. రెండు దశల అథెంటికేషన్‌ ఉంటే యాపిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌, ఆరంకెల డిజిట్‌ వెరిఫికేషన్‌ కోడ్‌ని ఎంచుకున్న డివైజ్‌కి పంపాలి.

  • ‘ఎరేజ్‌’పై క్లిక్‌తో చాయిస్‌ని కన్‌ఫర్మ్‌ చేయాలి.

  • అది అడిగితే యాపిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌ని మళ్ళీ ఎంటర్‌ చేయాలి.

ఈ రెండో పద్ధతుల్లోనూ ఒకటి గుర్తుంచుకోవాలి. ఐఫోన్‌ డేటా విషయంలో రెగ్యులర్‌ బ్యాకప్‌ ఉండాలి. అన్‌లాకింగ్‌ ప్రక్రియలో డేటా నష్టపోకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చాలా అవసరం. మరీ అవసరమైతేనే ఈ ప్రక్రియలను చేపట్టాలి. మిస్‌యూజ్‌ చేస్తే మొదటికే మోసం కలుగుతుంది. అలాగే అవసరమైన పర్మిషన్లనూ ఎప్పటికప్పుడు తీసుకుని మరీ ఈ ప్రక్రియలను చేపట్టాలి.

Updated Date - 2023-08-26T00:17:43+05:30 IST