ఆస్ర్టోనాట్ కావాలని..: ఇషిత
ABN , First Publish Date - 2023-11-06T05:11:22+05:30 IST
నేను ఇంటర్ వరకు ఐర్లాండ్‌లోనే చదువుకున్నా. యూర్‌పలో స్పేస్, ఎయిర్‌ఫోర్స్ రంగాలకు ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత ఉన్నాయి.
నేను ఇంటర్ వరకు ఐర్లాండ్‌లోనే చదువుకున్నా. యూర్‌పలో స్పేస్, ఎయిర్‌ఫోర్స్ రంగాలకు ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత ఉన్నాయి. అమెరికా వచ్చాక పలు అంతరిక్ష పరిశోధనల గురించి తెలుసుకున్నాను. మరింత లోతుగా అధ్యయనం చేయాలనే ఆసక్తి ఎక్కువైంది. ఆ క్రమంలోనే ఆస్ర్టోనాట్ అవ్వాలన్న కోరిక బలపడింది. ఆస్ర్టోనాట్ కావాలంటే విమానాలు నడపడం నేర్చుకోవాలి. దాని కోసం గత జూలైలో పైలట్ శిక్షణ పూర్తి చేసుకున్నా. అది అవ్వగానే గ్లైడర్‌తో నా శిక్షణ మొదలుపెట్టాను. దీనికి ఇంజన్ ఉండదు. తర్వాత ఇంజన్ ఉన్న ఫ్లయిట్ నడిపాను. శిక్షణ పూర్తయిన తరువాత చెల్లి తాన్వితో మొదటి రైడ్ చేశా. ముందుగా సోలో (సింగిల్‌గా ఫ్లయిట్ నడపడం)లో ట్రైనింగ్ ఇస్తారు. తరువాత లైసెన్స్ ట్రైనింగ్ ఇస్తారు. 14 ఏళ్లకే ఇంజన్ ఏరోప్లెయిన్‌లో సోలో శిక్షణ పూర్తి చేసుకున్నా. 16 ఏళ్లకు లైసెన్స్ ట్రైనింగ్ తీసుకున్నా. పవర్ ఫ్లయిట్‌లో 16 ఏళ్లకు సోలో శిక్షణ పూర్తి చేశా. అంతరిక్షంలో పరిశోధనలు చేయాలన్నది నా ఆశయం. దీనికి ఫ్లయిట్ ఎక్సీపీరియన్స్ చాలా అవసరం. అమెరికాలో ‘ఎక్స్‌పెర్‌మెంటల్ ఎయిర్‌క్రాఫ్ట్ అసోసియేషన్’ పిల్లలకు మొదటిసారిగా ఉచితంగా శిక్షణ ఇస్తోంది. నా పుట్టినరోజున కుటుంమంతా కలిసి అక్కడికి వెళ్లాం. నాన్న సరాదాగా నన్ను గ్లైడర్ ఎక్కించారు. శిక్షణ పూర్తయిన తర్వాత నేను సింగిల్‌గా ఫ్లయిట్‌ను 4వేల అడుగుల ఎత్తు వరకు తీసుకెళ్లాను. ఆ సమయంలో సీతాకోకచిలుకలా పైకి ఎగిరిన అనుభూతి కలిగింది. నాలాంటి ఔత్సాహికులకు మార్గదర్శనం ఇవ్వాలన్న ఉద్దేశంతో మూడేళ్ల కిందట ‘స్కై రైడర్స్ క్లబ్’ ఏర్పాటు చేశాను. ఇందులో 50 మంది విద్యార్థులు ఉన్నారు. స్థానికంగా ఉన్న లైబ్రరీలను సమన్వయం చేసుకుని ఎయిర్‌ఫోర్స్ మీద ఆసక్తి ఉన్న వారికి బేసిక్స్ నేర్పిస్తున్నా. బొమ్మ విమానాలను తయారు చేసి డెమోలు ఇస్తున్నా.