Radhika Madan : నటి అవుతానని.. అనుకోలేదెన్నడూ
ABN , First Publish Date - 2023-09-17T05:27:28+05:30 IST
బాలీవుడ్‌లో ‘పటాకా’తో క్రేజ్ సంపాదించుకున్న కథానాయిక రాధిక మదన్. ఇపుడీ బ్యూటీ హిందీ చిత్రాలతో దూసుకుపోతోంది. రాధిక మదన్ కెరీర్‌తో పాటు జీవిత విశేషాలివే..

బాలీవుడ్‌లో ‘పటాకా’తో క్రేజ్ సంపాదించుకున్న కథానాయిక రాధిక మదన్. ఇపుడీ బ్యూటీ హిందీ చిత్రాలతో దూసుకుపోతోంది. రాధిక మదన్ కెరీర్‌తో పాటు జీవిత విశేషాలివే..
‘‘నటిగా అవార్డులు అందుకున్నా. పలు వాణిజ్య ఉత్పత్తుల ప్రచారకర్తగా గుర్తింపు వచ్చింది. ఇన్‌స్టాలాంటి సోషల్ మీడియాలో అభిమానుల ఆదరణ.. ఇదంతా విచిత్రమే అనిపిస్తుంది. ఎందుకంటే నేను కెమెరా ముందు నటిస్తానని అనుకోలేదు. నేను సాధారణంగా ఆలోచించే అమ్మాయిని. అన్నం తినకుంటే నీరసపడిపోతావని తిడితే.. తిట్టించుకునే సగటు అమ్మాయిని. ఏదో డ్యాన్సర్‌గా స్థిరపడిపోతానేమో అనుకున్న.. నేను నటిగా ఇలా గుర్తింపు తెచ్చుకుంటానని అస్సలు అనుకోలేదు.
అలా తెర మీదకు...
ఢిల్లీలో పుట్టి పెరిగా. మా నాన్న వ్యాపారవేత్త. అమ్మ పెయింటర్. చిన్నప్పటి నుంచి డ్యాన్సంటే ఇష్టం. డ్యాన్స్ స్కూల్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉండేదాన్ని. డ్యాన్స్‌నే కెరీర్‌గా ఎంచుకోవాలని అనుకునేదాన్ని. అదే సమయంలో అంటే 2014లో ‘మేరీ ఆషికీ తుమ్ సే హై’ సీరియల్‌లో శక్తి అరోరాతో కలసి లీడ్ పాత్ర చేశా. ఆ పాత్రతో మంచి పేరు వచ్చింది. రెండేళ్ల పాటు కొనసాగిన ఆ సీరియల్‌లో 400 ఎపిసోడ్స్‌లో నటించా. పేరుతో పాటు అవార్డులూ వచ్చాయి. ‘జలక్ దిక్‌లాజా-8’ రియాలిటీ షోలో కంటె్‌స్టను. టెలివిజన్ వల్లే.. సినిమాల్లో అవకాశం దక్కింది. నా మొదటి చిత్రం ‘పటాకా’.
దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రాజస్తానీ అమ్మాయిగా నటించా. బెస్ట్ న్యూకమర్ అవార్డు అందుకున్నా.
వెనక్కి తిరిగి చూసుకోలేదు...
ఇర్ఫాన్‌ఖాన్‌తో కలసి ‘అంగ్రేజి మీడియమ్’లో నటించటం ఓ మంచి అనుభూతి. ‘షిద్దాత్’, ‘కుట్టె’, ‘కాచే లింబు’ చిత్రాల్లో నటించా. నాలుగైదు చిత్రాలు చేతిలో ఉన్నాయి. రెండు వెబ్ సిరీసుల్లో నటించా. నాకోసమే మంచి పాత్రలు రాసుకుని వస్తున్నారు కొందరు దర్శకులు. డ్యాన్సు గురించి మాత్రమే ఆలోచించే నేను ఇలా రెడీ యాక్షన్, కట్ మధ్యలోకి వస్తానని ఊహించనేలేదు. ఈ లైఫ్ బాగుంది. నటి అనే భావన నన్ను మోటివేట్ చేస్తుంది. ఏ పాత్రకైనా వందశాతం హోమ్‌వర్క్ చేస్తా. మధ్యలో వదిలేయటం, సగం పని చేయటం నచ్చదు. ఏదేమైనా టీవీ నటులకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉండదు. సంవత్సరాల పాటు అక్కడే నటించాల్సిందే. సినిమాల్లో నటించాలంటే అంత ఈజీ కాదు. అయితే ఆడియన్స్ ప్రతిభను గుర్తిస్తున్నారు. అందువల్లే మాలాంటి వారికి వెండితెర అవకాశాలు దక్కుతున్నాయి. ఇదెంతో మంచి పరిణామం. ఇప్పుడు నాకెరీర్ ఇలా ఉందంటే.. అంతా స్మాల్ స్ర్కీన్ మహిమే. నటిగా మంచి కథలను ఎంచుకోవాలి. అగ్ర దర్శకుల చిత్రాల్లో నటించాలనుంది’.