Nehasharma: ట్రోలింగ్స్‌ పట్టించుకోను

ABN , First Publish Date - 2023-03-18T23:54:43+05:30 IST

సోషల్‌మీడియాలో నేహాశర్మ చురుగ్గా ఉంటుంది. ఇన్‌స్టా, ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో ఆమె పోస్ట్‌లకు విపరీతమైన స్పందన ఉంటుంది.

 Nehasharma: ట్రోలింగ్స్‌  పట్టించుకోను

సోషల్‌మీడియాలో నేహాశర్మ చురుగ్గా ఉంటుంది. ఇన్‌స్టా, ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో ఆమె పోస్ట్‌లకు విపరీతమైన స్పందన ఉంటుంది. ఆమె ఫొటోలతో పాటు హాలిడే డెస్టినేషన్స్‌, షూటింగ్‌ స్పాట్స్‌, బ్రాండింగ్‌ డీటైల్స్‌ను షేర్‌ చేస్తుంది. 1.53 కోట్ల మంది ఇన్‌స్టాలో ఆమెను ఫాలో అవుతున్నారు. నేహ ఎప్పుడూ స్కిన్‌ షో చేస్తుందని అంటుంటారు. ‘నా లైఫ్‌ ఇది. నాకిష్టమైన ఫొటోలు షేర్‌ చేయటంలో తప్పేముంది?’ అంటుంది. ‘అదే పనిగా పని కట్టుకుని ట్రోల్‌ చేస్తుంటారు. కామెంట్‌ చేస్తుంటారు. అయితే అవేమీ పట్టించుకోను. నా సినిమాలు సరిగా ఆడకున్నా నాకు మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది. వారి కోసమే సోషల్‌ మీడియాలో అప్‌డేట్స్‌ ఉంటాయి. ట్రోలింగ్స్‌ పట్టించుకోను. వాళ్లకు పనిలేదు. ఖాళీగా ఉన్నారు. కనీసం నా గురించి నెగటివిటీని స్ర్పెడ్‌ చేస్తున్నారంటే.. నేను ఏదోటి సాధించాననే కదా!’ అంటుంది నేహా.

అలా సినిమాల్లోకి..

నేహాశర్మ పుట్టి పెరిగింది బిహార్‌లోని భగల్‌పూర్‌ సిటీలో. చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యతో బాధపడేది. అయితే చదువుల్లో మాత్రం చురుకు. కల్చరల్‌ యాక్టివిటీ్‌సలో ముందుండేది. కథక్‌లో శిక్షణ పొందింది. మ్యూజిక్‌ వినటం, డ్యాన్స్‌ చేయటం చిన్నప్పటినుంచే అలవాటు. ‘అందరి అమ్మానాన్నల్లాగా మా ఇంట్లో ఆలోచించారు. నన్ను ఏ డాక్టరో, ఏ ఇంజనీరో చేద్దామనుకున్నారు. నేను డిజైనర్‌ అవుతానని చెప్పినా వినిపించుకోలేదు. బిటెక్‌ తర్వాత నిఫ్ట్‌ పరీక్షల్లో ఆలిండియా 36వ ర్యాంక్‌ సాధించా. దాంతో ఢిల్లీ నిఫ్ట్‌లో చేరాను’ అంటున్న నేహ... ఆ తర్వాత మోడలింగ్‌లో రాణించింది. ‘మోడలింగ్‌తో ఆత్మవిశ్వాసం వచ్చింది. అయితే క్యాట్‌వాక్‌లా సినిమాల్లో ప్రవేశం కేక్‌వాక్‌ కాదు. తిరస్కరణలు వచ్చాయి. ఆ సమయంలోనే తెలుగులో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘చిరుత’లో నటించే అవకాశం వచ్చింది. టాలీవుడ్‌ ద్వారా సినిమాల్లోకి రావటం సంతోషం’ అంటుంది నేహాశర్మ.

బాలీవుడ్‌లో పాపులర్‌...

‘క్రూక్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో ఇమ్రాన్‌ హష్మీ జోడీగా అడుగెట్టింది. ఆ తర్వాత ‘జయంతభాయ్‌ కి లవ్‌స్టోరీ’, ‘యమ్‌లా పగ్‌లా దివానా 2’, ‘యంగిస్తాన్‌’, ‘తుమ్‌ బిన్‌ 2’, ‘ముబారకన్‌’ ‘తానాజీ’ చిత్రాల్లో, ‘ఇల్లీగల్‌’, ‘షైనింగ్‌ విత్‌ ద శర్మాస్‌’ లాంటి వెబ్‌సిరీ్‌సల్లో నటించింది. మ్యూజిక్‌ వీడియోలతో పాపులరైంది. ‘హిట్‌, ఫ్లాపులతో ప్రభావానికి గురవ్వను. నా పని నేను చేసుకుంటూ వెళ్తా’ అంటుందీ కథానాయిక. ‘నాకు కొత్త ప్రాంతాలకు వెళ్లటం ఇష్టం. ప్రతిసారి నా డెస్టినేషన్‌ లిస్ట్‌ మారుతుంటుంది’ అంటుందీమె. అన్నట్లు నేహాశర్మ చెల్లెలు ఆయేషాశర్మ కూడా నటి. నేహ తండ్రి అజిత్‌శర్మ బిహార్‌లో కాంగ్రెస్‌ నాయకులు. తన తండ్రికోసం ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటుంది నేహాశర్మ.

Updated Date - 2023-03-18T23:54:43+05:30 IST