Share News

Hair Care : మందారంతో జుట్టుకు ఆరోగ్యం...

ABN , Publish Date - Dec 14 , 2023 | 05:03 AM

మందారంలో విటమిన్‌-సి, అమినోయాసిడ్లు ఉంటాయి. ముఖ్యంగా ఇవి జుట్టులో ఉండే కెరోటిన్‌ను పెంచటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మందారంతో ఇలా హెయిర్‌ ప్యాక్స్‌ చేసుకోవచ్చు..

Hair Care : మందారంతో జుట్టుకు ఆరోగ్యం...

మందారంలో విటమిన్‌-సి, అమినోయాసిడ్లు ఉంటాయి. ముఖ్యంగా ఇవి జుట్టులో ఉండే కెరోటిన్‌ను పెంచటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మందారంతో ఇలా హెయిర్‌ ప్యాక్స్‌ చేసుకోవచ్చు..

  • గుప్పెడు మందారం ఆకులు, మూడు మందారాలు కలిపి గ్రైండ్‌ చేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి రెండు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ లేదా కొబ్బరి నూనె కలిపి మెత్తగా చేయాలి. జుట్టు మాడుకు పట్టేట్లు ఈ పేస్ట్‌ను పట్టించి.. కనీసం అరగంట నుంచి నలభై నిముషాల వరకు ఉంచి మంచి నీళ్లతో కడిగేయాలి. ఇలా రెండువారాలకోసారి చేస్తుంటే జుట్టు పెరుగుదల బావుంటుంది.

  • మందారం ఆకులు, పూలను రెండు పిడికిళ్లు తీసుకోవాలి. వీటిని గ్రైండ్‌లో వేశాక.. గుప్పెడు కరివేపాకును కూడా వేయాలి. ఈ చూర్ణానికి కొబ్బరినూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే తెల్లని జుట్టు సమస్య తగ్గుతుంది.

  • ఎలాంటి ఆయిల్‌ కలపకుండా కేవలం మందారం ఆకులు లేదా మందారం పూల పేస్ట్‌ను పట్టించుకుంటే సరి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

  • బౌల్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల ఎండిన మందారాలతో చేసిన పొడి వేయాలి. అందులోకి నాలుగు టేబుల్‌ స్పూన్ల పెరుగు వేసి మిశ్రమంగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత మైల్డ్‌ షాంపూతో కడిగేస్తే తల చల్లగా ఉంటుంది. కురులు గట్టిపడతాయి.

  • బౌల్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల ఉసిరిపొడి, అంతే స్థాయిలో మందారం ఆకుల పొడిని కలిపి మిశ్రమంగా చేసి పట్టించాక గంట పాటు ఉంచాక శుభ్రపరచుకోవాలి. అలా తరచూ చేస్తుంటే జుట్టులో పెరుగుదల ఉంటుంది.

  • రెండు టేబుల్‌ స్పూన్ల మందారం పొడి, రెండు టేబుల్‌ స్పూన్ల ఉల్లిపాయ రసం కలిపి చూర్ణం చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు ఊడిపోదు.

  • బౌల్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల అలొవెరా జెల్‌, అందులోకి రెండు టేబుల్‌ స్పూన్ల మందారం ఆకుల పొడిని తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా రెండు వారాలకోసారి చేస్తుంటే జుట్టు కుదుళ్లు గట్టిగా ఉంటాయి.

Updated Date - Dec 14 , 2023 | 05:03 AM