Google Play Store : యాప్‌లు డౌన్‌లోడ్ కాకుంటే....?
ABN , First Publish Date - 2023-07-21T23:20:27+05:30 IST
ఆండ్రాయిడ్ డివైజ్‌లకు అధికారిక యాప్ స్టోర్ ‘గూగుల్ ప్లే స్టోర్’. గేమ్స్ నుంచి పలు విభాగాలకు చెందిన యాప్‌లకు ఇది నిలయం. యూజర్లు
ఆండ్రాయిడ్ డివైజ్‌లకు అధికారిక యాప్ స్టోర్
‘గూగుల్ ప్లే స్టోర్’. గేమ్స్ నుంచి పలు విభాగాలకు
చెందిన యాప్‌లకు ఇది నిలయం. యూజర్లు
తమకు అవసరమైనవి డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటారు.
అప్డేటెడ్ వెర్షన్స్‌నూ పొందాల్సి ఉంటుంది. ఒక్కోసారి డౌన్‌లోడింగ్‌లో సమస్యలు
ఎదురవుతూ ఉంటాయి.అయితే వీటిని అధిగమించేందుకు..
ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు స్టేబుల్ కనెక్షన్ చాలా అవసరం. వైఫై నెట్‌వర్క్ రిలయబిలిటీకి తోడు మొబైల్ డేటా సిగ్నల్ పటిష్టంగా ఉండాలి.
వైఫైని ఉపయోగిస్తూ ఉంటే ఇబ్బందులు వచ్చినప్పుడు రౌటర్‌ను రీస్టార్ట్ చేయాలి. లేదా వేరే నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావాలి. తద్వారా కనెక్షన్ సమస్యలను మొదట సరిచేసుకోవాలి.
ప్లే స్టోర్‌లోనే ఒక్కోసారి పేరుకుపోయిన క్యాచే, డేటా కూడా డౌన్‌లోడింగ్‌కు అవరోధంగా నిలుస్తుంది. దీన్ని పరిష్కరించేందుకు డివైజ్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. యాప్స్ లేదంటే అప్లికేషన్ మేనేజర్ సెక్షన్‌లోకి వెళ్ళాలి. అక్కడ గూగుల్ ప్లే స్టోర్‌ని లొకేట్ చేసి అక్కడ క్యాచే, డేటాను క్లియర్ చేయాలి. డివైజ్ మోడల్, ఆండ్రాయిడ్ వెర్షన్‌న అనుసరించి ఈ ప్రక్రియలో కొద్దిపాటి తేడాలు ఉంటాయి.
యాప్స్ మాదిరిగానే ప్లేస్టోర్‌కు కూడా గూగుల్ అప్డేట్స్ ఉంటాయి. ఔట్ డేటెడ్ యాప్స్‌తో సానుకూలత తక్కువగా ఉంటుంది. అప్డేట్ చేసుకునేందుకు ప్లే స్టోర్‌ని ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్ వెర్షన్‌ను లొకేట్ చేయాలి. అప్డేట్ అందుబాటులో ఉంటే దాన్ని ఇన్‌స్టాల్ చేసుకునేందుకు ఆన్‌స్ర్కీన్ ప్రాంప్ట్స్‌ని ఫాలో కావాలి.
ఉపయోగిస్తున్న ఫోన్‌లో స్టోరేజి సదుపాయం తక్కువగా ఉంటే కూడా యాప్ డౌన్‌లోడింగ్ కుదరదు. యాప్‌నకు అవసరమైన స్టోరేజీ అవకాశం ఉండేలా చూసుకోవాలి.
చివరగా ఒక పాత ట్రిక్కు. డివైజ్‌ను రీస్టార్ చేయాలి. కంప్లీట్ రిఫ్రష్ చేసుకుని మరో సారి డౌన్‌లోడింగ్ పని చేసుకోవాలి.