Fruit water: ఫ్రూట్ వాటర్
ABN , First Publish Date - 2023-05-24T23:50:12+05:30 IST
వేసవిలో పండ్ల రసాలే కాదు. పండ్ల ముక్కలు వేసిన నీళ్లు తాగినా వేసవి తాపం తీరి, కొత్త ఉత్తేజం దక్కుతుంది. వేసవి తాపం, దాహం తీరడంతోపాటు ఉపశమనాన్ని అందించే ఫ్రూట్ వాటర్ ఎలా తయారుచేసుకోవాలంటే...

వేసవిలో పండ్ల రసాలే కాదు. పండ్ల ముక్కలు వేసిన నీళ్లు తాగినా వేసవి తాపం తీరి, కొత్త ఉత్తేజం దక్కుతుంది. వేసవి తాపం, దాహం తీరడంతోపాటు ఉపశమనాన్ని అందించే ఫ్రూట్ వాటర్ ఎలా తయారుచేసుకోవాలంటే...
కావలసిన పదార్థాలు:
స్ట్రాబెర్రీలు - 4
నిమ్మకాయ - 1
నీళ్లు - 4 గ్లాసులు
తులసి ఆకులు - 5
తేనె - 1 టేబుల్ స్పూను
తయారీ విధానం:
స్ట్రాబెర్రీలు శుభ్రంగా కడిగి, ముక్కలు చేసి పెట్టుకోవాలి.
నిమ్మకాయ చక్రాలుగా కోసుకోవాలి.
వెడల్పాటి గిన్నెలో నీళ్లు నింపి, ముక్కలు, తేనె, తులసి ఆకులు వేసి కలపాలి.
ఈ గిన్నెను ఫ్రిజ్‌లో 3 గంటల నుంచి 2 రోజుల వరకూ ఉంచి వాడుకోవచ్చు.