Omega Fatty Acids: ఒమేగా ఫ్యాటీ యాసిడ్ల కోసం...

ABN , First Publish Date - 2023-02-21T02:57:42+05:30 IST

మానవ శరీర జీవక్రియలు సక్రమంగా సాగడం కోసం, ఒమేగా3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు అవసరం. శరీరంలో ఆరోగ్య కణాల ఉత్పత్తికి, మెదడులోని న్యూరాన్ల సామర్థ్యానికి ఈ ఫ్యాటీ యాసిడ్లు తోడ్పడతాయి.

Omega Fatty Acids: ఒమేగా ఫ్యాటీ యాసిడ్ల కోసం...

మిరకిల్‌ సీడ్స్‌

మానవ శరీర జీవక్రియలు సక్రమంగా సాగడం కోసం, ఒమేగా3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు అవసరం. శరీరంలో ఆరోగ్య కణాల ఉత్పత్తికి, మెదడులోని న్యూరాన్ల సామర్థ్యానికి ఈ ఫ్యాటీ యాసిడ్లు తోడ్పడతాయి. అయితే వీటిని మన శరీరం తనంతట తాను ఉత్పత్తి చేసుకోలేదు కాబట్టి వాటిని మనం బయటి నుంచి తీసుకోవాలి. ఇందుకోసం గుమ్మడి, నువ్వులు, పొద్దుతిరుగుడు, అవిసె, షియా విత్తనాలను కలిపి విత్తన మిశ్రమాన్ని తయారుచేసుకుని వాడుకోవాలి. వీటిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్లతో పాటు జింక్‌, పీచు, ప్రొటీన్‌, ఐరన్‌, విటమిన్‌ ఇ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తన మిశ్రమాన్ని పెరుగు, సలాడ్‌, సూప్స్‌ మీద చల్లుకుని తినవచ్చు.

Updated Date - 2023-02-21T02:57:43+05:30 IST