Skin Care : మెరిసే చర్మం కోసం

ABN , First Publish Date - 2023-08-02T04:56:44+05:30 IST

ఏ కాలంలో అయినా చర్మాన్ని జాగ్రత్తగా ఉంచుకోకపోతే.. అంతే సంగతులు! ముఖ్యంగా ముఖ చర్మం, చేతులు, మెడ మీద వెంట్రుకలు పెరిగితే చూడటానికి బావుండదు. ఇలాంటి

Skin Care : మెరిసే చర్మం కోసం

ఏ కాలంలో అయినా చర్మాన్ని జాగ్రత్తగా ఉంచుకోకపోతే.. అంతే సంగతులు! ముఖ్యంగా ముఖ చర్మం, చేతులు, మెడ మీద వెంట్రుకలు పెరిగితే చూడటానికి బావుండదు. ఇలాంటి అవాంఛిత రోమాలను తొలగించటానికి కొన్ని పద్ధతులున్నాయి.

  • చర్మ సమస్యల చికిత్సకు పసుపు ఉపయోగపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌ లక్షణాలుండే ఈ పసుపు చర్మంపైన ఉండే

  • వెంట్రుకలు పెరగనివ్వదు. అందుకే పసుపులో గులాబీనీళ్లు లేదా పాలు కలిపి ఆ పేస్ట్‌ను పెదవులపైన లేదా ముఖం మీద పట్టిస్తే అవాంఛిత రోమాలు పెరగవు.

  • బొప్పాయి తొక్కను తీసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు కలిపి చూర్ణం చేయాలి. ఈ చూర్ణాన్ని చర్మం మీద వెంట్రుకలు ఉండే ప్రాంతంలో పట్టించి అరగంట ఆగిన తర్వాత మంచి నీళ్లతో శుభ్రపరచుకోవాలి. ఇలా నాలుగు వారాల పాటు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

  • బౌల్‌లో నిమ్మరసం, తేనెను సరైన పాళ్లలో తీసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. నిమ్మలో సిట్రిక్‌ ఆమ్లం ఉండటం వల్ల మంచి క్లీనింగ్‌ ఏజెంట్‌లా ఉపయోగపడుతుంది. హైడ్రేటింగ్‌, మాయిశ్చరైజింగ్‌ లక్షణాలుండే తేనెను నిమ్మరసంతో కలిపినపుడు చర్మంమీద వెంట్రుకలు పెరగవు. పైగా చర్మం స్మూత్‌గా తయారవుతుంది.

  • ఎర్ర కందిపప్పు, బంగాళదుంపను కలిపి మెత్తని చూర్ణం చేసుకోవాలి. బంగాళదుంపలోని న్యాచురల్‌ బ్లీచ్‌ లక్షణాల వల్ల అవాంఛిత రోమాల రంగు తగ్గిపోతుంది. వెంట్రుకలు ఉన్నట్లు కనపడవు.

  • బౌల్‌లో టేబుల్‌ స్పూన్‌ తేనె, రెండు టేబుల్‌ స్పూన్ల చక్కెర వేసి కొద్దిగా నీళ్లు కలిపి మిక్స్‌ చేయాలి. మైక్రోవేవ్‌లో అరనిముషం ఉంచి తీసేసిన తర్వాత అన్‌వాంటెడ్‌ ఫేసియల్‌ హెయిర్‌ మీద పట్టించాలి. వ్యతిరేక దిశలో పీల్‌ను తీసేయాలి.

  • చర్మం మీద అందవిహీనంగా కనపడే వెంట్రుకలను హెయిర్‌ రిమూవర్స్‌తో తీసేయవచ్చు. ప్లక్కింగ్‌ బదులుగా వ్యాక్సింగ్‌ చేసుకోవచ్చు. పలు జాగ్రత్తలతో నిపుణులను అడిగి ఈ పని చేయాలి. లేకపోతే లేజర్‌ చికిత్సతో కూడా ఈ సమస్యను శాశ్వతంగా అధిగమించే అవకాశం ఉంది.

Updated Date - 2023-08-02T04:56:44+05:30 IST