పెదవులు పొడిబారుతుంటే?

ABN , First Publish Date - 2023-10-04T04:26:59+05:30 IST

వెన్న లేదా నెయ్యి: ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు పెదవులకు వెన్న లేదా నెయ్యి అప్లై చేయాలి.

 పెదవులు పొడిబారుతుంటే?

చల్లని గాలులకు పెదవులు పొడిబారడం సహజం.

అయితే చల్లని వాతావరణానికి పెదవులు పగిలిపోకుండా ఉండాలంటే కొన్ని సౌందర్య చిట్కాలు పాటిస్తూ ఉండాలి. అవేంటంటే...

వెన్న లేదా నెయ్యి: ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు పెదవులకు వెన్న లేదా నెయ్యి అప్లై చేయాలి.

వాడే లిప్‌స్టిక్‌లో మాయిశ్చరైజర్‌ ఉండేలా చూసుకోవాలి.

పెదవులను నాలుకతో తడుపుకునే అలవాటు మానుకోవాలి.

గులాబీ రేకులను పాలలో నానబెట్టి రుబ్బి పెదవులు రుద్దుకోవాలి.

పొట్టు రేగిన పెదవులను గోళ్లతో గిల్లుకోకూడదు.

పెదవులను ముందు పళ్లతో కొరకే అలవాటు ఉంటే మానుకోవాలి.

వీలైనన్ని ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి.

చల్లని గాలికి తిరిగేటప్పుడు ముఖానికి స్కార్ఫ్‌ కట్టుకోవాలి.

Updated Date - 2023-10-04T04:27:19+05:30 IST