Octopus : మీకు తెలుసా?

ABN , First Publish Date - 2023-01-31T00:04:28+05:30 IST

సముద్రజీవుల్లో ప్రత్యేకమైనది ఆక్టోపస్‌. అన్ని సముద్రాల్లో లోతులో ఇవి జీవిస్తాయి. ప్రతి ఆక్టోపస్‌కు మూడు గుండెలు ఉంటాయి. నీలం, కాపర్‌ బేస్డ్‌ రక్తాన్ని పంప్‌ చేస్తాయవి.

Octopus : మీకు తెలుసా?

  • సముద్రజీవుల్లో ప్రత్యేకమైనది ఆక్టోపస్‌. అన్ని సముద్రాల్లో లోతులో ఇవి జీవిస్తాయి. ప్రతి ఆక్టోపస్‌కు మూడు గుండెలు ఉంటాయి. నీలం, కాపర్‌ బేస్డ్‌ రక్తాన్ని పంప్‌ చేస్తాయవి.

  • ఆక్టోపీ అనేది గ్రీకు పదం.. ఆ భాషలోంచి పుట్టిందే ఇది. బహువచనం ఆక్టోపస్‌ అని రాయాలి. అయితే శాస్త్రవేత్తలు, అవగాహన ఉండేవారు తప్ప మిగిలినవారంతా ఆక్టోపస్‌ అని పిలుస్తుంటారు.

  • రాళ్ల మధ్య జీవిస్తాయి. రాళ్లతో ఇళ్లు కట్టుకుంటాయివి. ఎంత బాగా అంటే ఆ ఇంటికి డోర్‌ను కూడా పెట్టుకోగలవు.

  • ప్రపంచంలో 289 రకాల ఆక్టోపస్‌లుంటాయి. పెద్ద ఆక్టోపస్‌లను చూస్తే ఏలియన్లని భయపడతారు. కొన్నింటికి తలమీద టోపీల్లాంటి నిర్మాణం ఉంటాయి. ఇవి 330 మిలియన్ల కిందటివని శాస్త్రవేత్తల పరిశోధనలు చెబుతున్నాయి.

  • ఇవి ఎంత స్మార్ట్‌ అంటే జార్‌ల మూతలు తీయగలవు. పజిల్స్‌లాంటి దారుల్లో వేసినా సులువుగా చేధిస్తాయి. తన చుట్టూ ఉండే వాటిని పద్ధతిగా అసెంబుల్‌ చేసుకోగలవు.

  • కొట్లాటలో, ప్రమాదాల్లో కాళ్లు, చేతుల్లా ఉండే భాగాలు కట్‌ అయితే మళ్లీ వస్తాయి. బల్లితోకలా అనమాట.

  • తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునే హార్మోన్లు అన్ని జీవుల్లానే విడుదలయితాయి. అయితే ఆహారం దొరకనపుడు తనకు తానే తింటుంది.

  • 30 మిల్లీ సెకండ్స్‌లో తన రూపాన్ని మార్చుకుంటుంది. వెలుతురు పడుతూనే దూరంగా వెళ్లిపోతుంది. అలా దాని మెదడు పని చేస్తుంది.

  • పసిఫిక్‌ సముద్రంలోని ఆక్టోపస్‌లు ప్రపంచంలోనే బరువైనవి. ఒక్కోటి 15 కేజీలుంటాయి. ఈ సముద్రంలోని బతికే ఈ జీవులు 5000 అడుగుల లోతులో కూడా ఈదగలవు. ఎముకల్లేని జీవి ఇది. తన ఆహారాన్ని చేతులలాంటి నిర్మాణాలతో అందుకుని తింటుంది.

  • ఎముకల్లేని జీవుల్లో పెద్ద మెదడు ఉండేది ఇదే. నేలమీదపై నడుస్తుంది.. వేగంగా పరిగెత్తుతుంది. కొన్ని చిన్న ఆక్టోపస్‌లు ఆరునెలలు మాత్రమే జీవిస్తాయి. సాధారణంగా ఈ జీవుల జీవనకాలం మూడేళ్లు.

Updated Date - 2023-01-31T00:04:30+05:30 IST