Share News

Junk Food : రాత్రి వేళల్లో ఇవి తినవద్దు

ABN , Publish Date - Dec 17 , 2023 | 06:16 AM

ఏ ఆహారం ఎప్పుడు తినాలి? ఆయిర్వేద పద్ధతిలో దీనికి కూడా ఒక లెక్క ఉంది. చీకటి పడిన తర్వాత మన శరీరంలో మార్పులు వస్తాయి కాబట్టి ఈ కింది పదార్థాలను తినవద్దని ఆయిర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో చూద్దాం.

Junk Food : రాత్రి వేళల్లో ఇవి తినవద్దు

ఏ ఆహారం ఎప్పుడు తినాలి? ఆయిర్వేద పద్ధతిలో దీనికి కూడా ఒక లెక్క ఉంది. చీకటి పడిన తర్వాత మన శరీరంలో మార్పులు వస్తాయి కాబట్టి ఈ కింది పదార్థాలను తినవద్దని ఆయిర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో చూద్దాం.

పెరుగు: రాత్రి వేళలో పెరుగు తింటే శరీరంలో కఫ, పిత్త దోషాలు పెరుగుతాయి. దీని వల్ల శ్లేషం బాగా పడుతుంది. అందువల్ల వీలైనంత వరకు రాత్రి వేళలలో పెరుగును తినవద్దని సూచిస్తున్నారు.

గోధుమ: గోధుమ అరగటం కష్టం. అందువల్ల గోధుమతో చేసే ఆహార పదార్థాలను తినవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

పచ్చి కూరలు:రాత్రి వేళల్లో మన జీర్ణశక్తి మందగిస్తుంది. అందువల్ల ఆ సమయంలో పచ్చి కూరలు తినకూడదు. ఉడకపెట్టిన కూరల వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

మైదా: మైదాతో చేసిన పదార్థాలు తినటం వల్ల అజీర్తి చేస్తుంది. పైగా ఈ పదార్థాలు త్వరగా అరగవు. పైగా దీనిలో పెద్దగా పోషకాలు కూడా ఉండవు. అందువల్ల రాత్రి వేళల్లో మైదాతో చేసిన పదార్థాలు తినకపోవటం మంచిది.

జంక్‌ ఫుడ్‌: రాత్రి వేళల్లో ఎక్కువ మంది జంక్‌ ఫుడ్‌ తింటూ ఉంటారు. వీటిలో వాడే పదార్థాల వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. పైగా వీటిని రాత్రి వేళల్లో తినటం వల్ల గ్యాస్‌ సమస్య ఏర్పడుతుంది. అందువల్ల వీలైనంత వరకు రాత్రి వేళల్లో జంక్‌ ఫుడ్‌ను తినకపోవటం మంచిది.

Updated Date - Dec 17 , 2023 | 06:16 AM