డెనిమ్ డ్రీమ్
ABN , First Publish Date - 2023-07-05T00:27:15+05:30 IST
డెనిమ్ స్టైల్‌కు ఎప్పటికీ కాలం చెల్లదు. రంగులు, డిజైన్లు, స్టైల్స్ పరంగా జీన్స్ ప్యాంట్లలో ఎన్నో వినూత్న పోకడలు వస్తూనే ఉన్నాయి. ఆ వెరైటీల గురించి తెలుసుకుందాం!
డెనిమ్ స్టైల్‌కు ఎప్పటికీ కాలం చెల్లదు. రంగులు, డిజైన్లు, స్టైల్స్ పరంగా జీన్స్ ప్యాంట్లలో ఎన్నో వినూత్న పోకడలు వస్తూనే ఉన్నాయి. ఆ వెరైటీల గురించి తెలుసుకుందాం!
ఎంచుకునే డెనిమ్ స్టైల్‌ని బట్టి, హూందాగా, క్యాజువల్‌గా, చురుగ్గా, గంభీరంగా కనిపించవచ్చు. కాబట్టి సందర్భానికి తగ్గట్టు నప్పిన స్టైల్‌ను ఎంచుకోవడం అవసరం.
కలర్డ్ జీన్స్
ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నీలం.. ఇలా జీన్స్ లెక్కలేనన్ని ఆకర్షణీయమైన రంగుల్లో తయారవుతున్నాయి. అయితే వానా కాలంలో గ్రే, బ్రౌన్, బర్గండీ, రాయల్ బ్లూ, ఇండిగో లాంటి రంగుల జీన్స్‌ను ఎంచుకోవాలి.
క్రాప్‌డ్ జీన్స్
మోకాళ్ల దిగువకు లేదా యాంకిల్ పైకి ఉండే క్రాప్‌డ్ జీన్స్ సిలోవెట్‌లలో అందంగా కనిపిస్తాయి. క్యాజువల్ లుక్ సొంతం చేసుకోవాలనుకుంటే క్రాప్‌డ్ జీన్స్‌ను ఎంచుకోవాలి. దీంతో పాటు పొడవాటి టాప్స్ లేదా కార్డిగాన్స్ ధరించినా బాగుంటుంది.
కౌబాయ్ జీన్స్
జీన్స్ జాకెట్‌తో కలిపి ధరిస్తే, హాలీవుడ్ వెస్టర్న్ లుక్ సొంతం చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కోసం పరిమిత ఎంబ్రాయిడరీ ఉండేలా చూసుకోవాలి. తేలికపాటి జ్యువెలరీ ధరించాలి.
డెనిమ్ జాకెట్స్
డెనిమ్ జాకెట్స్‌ను ట్రౌజర్స్‌తో, డ్రెస్ షర్ట్ లేదా పీసెంట్ టాప్‌తో కలిపి ధరించాలి. లేదంటే పార్టీల్లో ఈవినింగ్ డ్రస్‌గా కూడా ధరించవచ్చు.
డబుల్ డెనిమ్
జీన్స్, డెనిమ్ జాకెట్స్‌కు బదులుగా డెనిమ్ షర్ట్స్,
యాక్సెసరీ్‌సను ఎంచుకోవచ్చు.
రిప్ప్ డ్ జీన్స్
రిప్ప్‌డ్ లుక్ తాజాగా షార్ట్స్‌కూ, జాకెట్స్, షర్ట్స్‌కూ విస్తరించింది. ఈ జీన్స్‌ను ఎలిగెంట్‌గా కనిపించే బ్లౌజ్‌లు, పూలు, కీటకాల్లా కనిపించే బ్రూచ్‌లు, క్రిస్టల్ రిమ్ కలిగి ఉండే సన్‌గ్లాసెతో మ్యాచ్ చేయాలి.