Cone Snail : మీకు తెలుసా?
ABN , First Publish Date - 2023-01-03T00:07:59+05:30 IST
కోన్ స్నెయిల్ (శంఖాకారం నత్త) సముద్రతీర ప్రాంతాల్లోని ఇసుకతిన్నెల్లో ఉంటాయి. గాస్ర్టోపోడా అనే జాతికి చెందినవి. ఇవి 900 రకాలకు పైగా ఉంటాయి.
కోన్ స్నెయిల్ (శంఖాకారం నత్త) సముద్రతీర ప్రాంతాల్లోని ఇసుకతిన్నెల్లో ఉంటాయి. గాస్ర్టోపోడా అనే జాతికి చెందినవి. ఇవి 900 రకాలకు పైగా ఉంటాయి.
ఇండో పసిఫిక్, సౌత్ ఆఫ్రికా తీర ప్రాంతాల్లో ఇవి ఎక్కువ. అయితే ప్రపంచంలో కంటే ఎక్కు కోన్ స్నెయిల్స్ మాత్రం దక్షిణ కాలిఫోర్నియా(అమెరికా)లో ఉన్నాయని శాస్త్రవేత్తలు గణాంకపరంగా వివరించారు.
ఇవి ఇసుకలోపల, రాళ్లకింద జీవిస్తాయి. పురుగులు, చిన్న చేపలు తిని ఒంటరిగా ఉంటాయి.
మనుషులు, జంతువుల ద్వారా ఎక్కువగా చనిపోతాయి. అయితే వీటి జీవనకాలం మాత్రం ఇరవై ఏళ్లవరకూ జీవిస్తాయి.
వీటి నోటీలో జిగురు ఉంటుంది. ఆ జిగురులో పురుగులు దొరికిపోతాయి. ఇప్పటివరకూ దొరికిన అతి పెద్ద కోన్ స్నెయిల్ 21 సెం.మీ. బరువు 100 గ్రాములు ఉంటాయి. మిగతా నత్తలతో పోలిస్తే వీటి వేగం ఎక్కువే.
వీటిని ఉత్త చేత్తో కాకుండా గ్లోవ్స్ ధరించి పట్టుకోవాలి. ఇది స్రవించే పదార్థం వల్ల చర్మానికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే వీటితో జాగ్రత్తగా ఉండాలంటారు.
కొన్ని రకాల మందుల్లో వీటిని వాడుతారు. ఇక వాటి శంఖుల్ని మాత్రం కొందరు కలెక్ట్ చేసుకుంటారు. మరికొందరు ఆభరణాలుగా ధరిస్తారు.