చుండ్రుకు చెక్‌

ABN , First Publish Date - 2023-01-25T23:14:44+05:30 IST

చుండ్రు ఒక పెద్ద సమస్య. చాలా మందికి చుండ్రు ఎందుకు వస్తుందో కూడా తెలియదు. చుండ్రు ఒక తరహా ఫంగస్‌ ఇన్పెక్షన్‌ అనే చెప్పాలి. తరచూ తలస్నానం చేయకపోవటం..

చుండ్రుకు చెక్‌

చుండ్రు ఒక పెద్ద సమస్య. చాలా మందికి చుండ్రు ఎందుకు వస్తుందో కూడా తెలియదు. చుండ్రు ఒక తరహా ఫంగస్‌ ఇన్పెక్షన్‌ అనే చెప్పాలి. తరచూ తలస్నానం చేయకపోవటం.. జుట్టుకు నూనె రాసి తర్వాత తలస్నానం చేయకుండా వదిలివేయటం.. జుట్టుకు హాని చేసే ఉత్పత్తులు వాడటం.. సరైన ఆహారాన్ని తీసుకోకపోవటం మొదలైన కారణాల వల్ల చుండ్రు వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ చుండ్రును తొలగించుకోవటానికి నిపుణులు కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు సూచిస్తున్నారు.

వేప: వేప ఆకుల వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. వేప నూనెను రాయటం వల్ల నెత్తి మీద ఉండే చర్మపు రంధ్రాలు తెరుచుకుంటాయి. వేప ఆకుల గుజ్జును తలకు రాసుకొని.. ఆ తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.

పెరుగు- ఉసిరి మిశ్రమం: ఉసిరిలో విటమిన్‌ సి లభిస్తుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యవంతంగా తయారవుతుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా చుండ్రును అరికట్టడంలో ఉపకరిస్తుంది. అందువల్ల పెరుగు- ఉసిరి మిశ్రమాన్ని తలకు పట్టించటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

పెరుగు: చుండ్రును అరికట్టడంలో పెరుగు గొప్ప పాత్రను పోషిస్తుంది. పెరుగును జుట్టును పట్టించి.. ఒక అరగంట ఆరనిచ్చి.. ఆ తర్వాత ఎక్కువ రసాయనాలు లేని షాంపుతో తలంటుకుంటే జుట్టు నిగనిగలాడుతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది.

Updated Date - 2023-01-25T23:14:45+05:30 IST