Chapati Tips: చపాతీ చిట్కాలు

ABN , First Publish Date - 2023-02-24T22:43:21+05:30 IST

వేడివేడిగా.. మెత్తని చపాతీలు తింటుంటే ఆ కిక్కే వేరబ్బా.. అనుకొనేవారు అనేక మంది. కానీ చాలా మందికి చపాతీలు చేస్తే మెత్తగా రావు. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు..

Chapati Tips: చపాతీ చిట్కాలు

వేడివేడిగా.. మెత్తని చపాతీలు తింటుంటే ఆ కిక్కే వేరబ్బా.. అనుకొనేవారు అనేక మంది. కానీ చాలా మందికి చపాతీలు చేస్తే మెత్తగా రావు. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు..

గోరు వెచ్చని నీళ్లు:

గోధుమ పిండిని గోరువెచ్చని నీళ్లతో కలిపి ముద్దగా చేసి 5 నిమిషాలు ఉంచాలి. ఆ పిండితో చేసిన చపాతీలు మెత్తగా ఉంటాయి. చల్లటి నీటితో పిండిని కలిపేట్టయితే 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ ముద్దను వదిలేయాలి. చపాతీ పిండిని మరీ గట్టిగా, అలాగని మరీ పలచగా కలపకూడదు.

రౌండ్‌గా:

చపాతీలను గుండ్రంగా ఒత్తడం చాలా ముఖ్యం. అదే విధంగా చపాతీ మొత్తం అంతా ఒకే విధంగా ఉండాలి. ఒక చోట ఎక్కువ పిండి.. మరో చోట తక్కువ పిండి ఉండకూడదు. చివరగా చపాతీని పెనం మీద నుంచి కాల్చే ముందు.. ఒత్తేడప్పుడు వేసిన పిండిని దులిపేయాలి. లేకపోతే చపాతీ మాడిపోయే అవకాశముంది.

పిండి ముఖ్యం:

మార్కెట్లో రకరకాల బ్రాండ్‌ల గోధుమపిండిలు లభ్యమవుతున్నాయి. కొన్ని రకాల గోధుమపిండిలు వాడినప్పుడు చపాతీలు మెత్తగా రావు. అందువల్ల కొన్ని బ్రాండ్‌లను ప్రయత్నించి.. వాటిలో మనకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవాలి. ఆ బ్రాండ్‌నే క్రమం తప్పకుండా వాడితే మంచిది.

నూనె బదులు నెయ్యి:

సాధారణంగా నేతితో చేసిన చపాతీలు మెత్తగా ఉంటాయి. అందువల్ల వీలైనంతగా నేతినే వాడటం మంచిది.

Updated Date - 2023-02-24T22:43:21+05:30 IST