Share News

Vitamin D : విటమిన్‌-డి తీసుకొనే ముందు...

ABN , First Publish Date - 2023-12-03T01:18:50+05:30 IST

ఆధునిక జీవనంలో వచ్చిన అనేక మార్పుల వల్ల చాలా మందిలో విటమిన్‌ ‘డి’ లోపం కనిపిస్తోంది. ఈ లోపాన్ని సరిచేసుకొనేందుకు కొందరు విటమిన్‌ ‘డి’ టాబ్‌లెట్స్‌ను

Vitamin D : విటమిన్‌-డి తీసుకొనే ముందు...

ఆధునిక జీవనంలో వచ్చిన అనేక మార్పుల వల్ల చాలా మందిలో విటమిన్‌ ‘డి’ లోపం కనిపిస్తోంది. ఈ లోపాన్ని సరిచేసుకొనేందుకు కొందరు విటమిన్‌ ‘డి’ టాబ్‌లెట్స్‌ను వాడుతున్నారు. అయితే వైద్య పరీక్షలు చేయించుకోకుండా.. డాక్టర్‌ సలహా లేకుండా ఈ టాబ్‌లెట్స్‌ను ఉపయోగించటం ప్రమాదకరమంటున్నారు వైద్య నిపుణులు. ఈ టాబ్‌లెట్స్‌ ఉపయోగించే ముందు చేయాల్సిన పనులివి..

డాక్టర్‌ను సంప్రదించండి

త్వరగా అలసిపోవటం, తరచు జ్వరాలు రావటం, నీరసం, డిప్రషన్‌, ఎముకల నెప్పులు మొదలైన సమస్యలు విటమిన్‌ డి లోపం వల్ల వస్తాయి. ఈ లక్షణాలు తరచు కనిపిస్తుంటే- ముందు డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత సమస్యకు తగిన డోసేజ్‌ను నిర్ధారించుకొని టాబ్‌లెట్స్‌ను వాడాలి. లేకపోతే సమస్య పరిష్కారం కాకపోవచ్చు.

మందులే కాదు..

చాలా మంది టాబ్‌లెట్స్‌ వేసుకుంటే సమస్య పరిష్కారమయిపోతుందనుకుంటారు. కానీ సహజసిద్ధంగా విటమిన్‌ డి లభించే చేపలు, గుడ్లు, ఎర్ర మాంసం పుట్టగోడుగులు మొదలైనవి కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. అంతే కాకుండా ప్రతి రోజు ఉదయం కనీసం 15 నిమిషాలు ఎండలో ఉండేలా చూసుకోవాలి.

అతిగా వద్దు..

విటమిన్‌ డి టాబ్‌లెట్స్‌ను ఎక్కువ కాలం తీసుకుంటే- కడుపు నొప్పి, వాంతులు, బీపీ మొదలైన సమస్యలు ఏర్పడే అవకాశముంది. అందువల్ల డాక్టర్‌ సలహా లేకుండా ఎక్కువ కాలం మందులు తీసుకోకూడదు.

మిగిలినవి కూడా..

కొన్ని సార్లు విటమిన్‌ డితో పాటుగా విటమిన్‌ ఏ, విటమిన్‌ కేలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు విటమిన్‌లు లేకుండా కేవలం డిని తీసుకోవటం వల్ల ప్రయోజనం ఉండదు.

Updated Date - 2023-12-03T01:18:51+05:30 IST