Beautiful life : బ్యూటిఫుల్ లైఫ్
ABN , First Publish Date - 2023-09-13T02:23:12+05:30 IST
మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతాం? మనతో మనమే 24/7 సమయం గడుపుతాం! ఇలా పుట్టింది మొదలు చివరి వరకూ మనకు మనమే..
మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతాం?
మనతో మనమే 24/7 సమయం గడుపుతాం!
ఇలా పుట్టింది మొదలు చివరి వరకూ మనకు మనమే
సన్నిహితులం! కాబట్టి మన మీద, మన ఆనందాల మీద, అందుకు తోడ్పడే జీవన విధానం మీద దృష్టి పెట్టాలి!
ఆరోగ్యం: ఏ పని చేయాలన్నా అందుకు శరీరం సహకరించాలి, శక్తితో, చలాకీగా ఉండాలి. కాబట్టి శరీరం ఫ్లెక్సిబిలిటీ, చురుకుదనం పొందేలా వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేయాలి. వ్యాయామం చేయడానికి అడ్డుపడే బద్ధకాన్ని వదలించాలంటే ఆహారంలో చక్కెరకు గుడ్ బై చెప్పాలి. ఈ నియమం కచ్చితంగా పాటిస్తూ కనీసం వారంలో మూడు రోజులు అరగంట వ్యాయామం చేస్తూ, క్రమంగా ఆ సమయాన్ని పెంచాలి. క్రమేపీ వ్యాయామం తీవ్రతా పెంచాలి. నెల రోజుల్లో మీలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
ఆలోచనలు: మనసులో చెలరేగే ఆలోచనలే మన చేతుల్లో ప్రతిబింబిస్తాయు. బలం, బలహీనతలు ఆలోచనల రూపంలో మన మెదడులోనే ఉంటాయి. చేయగలగడం, చేయలేకపోవడం, భయం, బెరుకు లాంటివన్నీ మనం ప్రత్యక్షంగా చేతల్లో పెట్టనంత వరకే మనల్ని వెనకకు లాగగలుగుతాయి. ఆ ఆలోచనలను లెక్క చేయకుండా అడుగు ముందుకేస్తే అసాధ్యమైనది ఏదీ లేదనే నిజం అనుభవానికొస్తుంది.
ఆనందం: వయసు ఆనందానికి అడ్డంకి కాకూడదు. ఆనందం కొంతమందికి, కొంత వయసుకే పరిమితం కాదు. కాబట్టి ఆనందాన్ని పొందే మార్గాలను అన్వేషించి, ఆచరించాలి. ప్రయాణాలు, అభిరుచులు, ఏకాంతాలు, సంగీతం, పుస్తక పఠనం... ఇలా మీకు ఆనందం దక్కే మార్గాలను వెతకాలి.