చర్మపు అలర్జీలు బలాదూర్‌

ABN , First Publish Date - 2023-05-09T02:11:07+05:30 IST

చర్మపు అలర్జీలకు కారణాలు అనేకం. ఆహారం, వాతావరణం, బాహ్య కారకాలు, రసాయనాలు.. ఇలా ఎన్నో కారణాల వల్ల చర్మపు అలర్జీలు వేధిస్తాయి.

చర్మపు అలర్జీలు బలాదూర్‌

ర్మపు అలర్జీలకు కారణాలు అనేకం. ఆహారం, వాతావరణం, బాహ్య కారకాలు, రసాయనాలు.. ఇలా ఎన్నో కారణాల వల్ల చర్మపు అలర్జీలు వేధిస్తాయి. ఇలాంటప్పుడు ఆ కారకాలకు దూరంగా ఉంటూ, తగిన హోమియో చికిత్సను తీసుకోవాలి.

చర్మం వాతావరణ ప్రభావాలు, రసాయనాలు, హానికరమైన రేడియేషన్లు, సూర్యుని వేడి నుంచి శరీరాన్ని రక్షించడమే కాకుండా, విటమిన్‌ డిని సంశ్లేషణం చేస్తుంది. జీర్ణ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థల్లో రుగ్మతలను చర్మం ప్రతిబింబిస్తుంది. కానీ మనలో చాలా మంది చర్మం ప్రదర్శించే రోగకారక ప్రారంభ హెచ్చరిక సంకేతాలను గమనించరు. అయితే ప్రతి ఒక్కరి చర్మం భిన్నంగా ఉంటుంది కాబట్టి సదరు వ్యక్తిని ప్రభావితం చేసే అలర్జీ కారకాన్ని గుర్తించడం అవసరం. హోమియో చికిత్సలో సమస్యకు కారకాన్ని మూల స్థాయిలోనే గుర్తించడంతో పాటు చర్మ స్వభావాన్ని పరిగణలోకి తీసుకుని, హానికరమైన దుష్ప్రభావాలకూ తావు లేకుండా అద్భుతమైన హోమియో మందులతో చికిత్స చేసుకోగలిగే వీలుంది.

అపిస్‌ మెల్లిపికా: ఇది దద్దుర్లు, అట్రికేరియల్‌ ర్యాష్‌లకు ఉత్తమ నివారిణి. తీవ్రమైన మంట, దురద, దద్దుర్లు లాంటి ఏ రకమైన అలర్జీకి అయినీ ఇది పని చేస్తుంది.

నాట్రమ్‌ మూర్‌: చర్మ అలర్జీలకు సాధారణంగా ఉపయోగించే హోమియో ఔషధమిది.

సల్ఫర్‌: చర్మ అలర్జీల చికిత్సకు అత్యంత సహజమైన హోమియో మందు ఇది. ఇది విపరీతమైన దురద, మంటలను తగ్గిస్తుంది.

హెపర్‌ సల్ఫర్‌: చర్మపు ముడతలు, కీళ్ల మీద ఏర్పడే అలర్జీలకు ఉపయోగపడుతుంది. చర్మం అడుగున చీము ఏర్పడడం లాంటి సమస్యలకు ఈ మందు పని చేస్తుంది. తామర స్కాల్స్‌, చర్మం సున్నితంగా మారిన సందర్భాల్లో కూడా ఉపయోగించవచ్చు.

కలాడియం: దద్దుర్లతో బాధపడే ఉబ్బసం వ్యక్తుల్లో ఈ మందు ఫలితాన్నిస్తుంది. ఈ రకమైన దద్దుర్లు ఆస్తమా అటాక్స్‌లో కనిపిస్తూ ఉంటాయి.

జూ మెడోర్రినమ్‌: పాయువు చుట్టూ దద్దుర్లు ఉన్న పిల్లలు (డైపర్‌ ర్యాష్‌)కు ఈ మందు ఉపయోగపడుతుంది.

సోరినమ్‌: చర్మపు దద్దుర్లు, కీళ్ల వంపుల్లో దురదలకు ఈ మందు అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. నిరంతరం గోకడం వల్ల రక్తస్రావం అయ్యే సందర్భాల్లో ఈ మందు మెరుగ్గా పని చేస్తుంది.

ఈ మందులతో పాటు అర్జెంకం నైట్రికం, డల్కమరా, గ్రాఫైటిస్‌, హిస్టామినం, పల్సటిల్ల, రస్టాక్స్‌ లాంటి ఔషధాలు కూడా అలర్జీలకు చక్కని ఫలితాలనిస్తాయి.

డాక్టర్‌ దుర్గాప్రసాద రావు గన్నంరాజు

హోమియో వైద్యులు,

నిత్య హోమియోపతి, హైదరాబాద్‌.

Updated Date - 2023-05-09T02:11:07+05:30 IST