Kakarakaya : కాకర తింటున్నారా..?

ABN , First Publish Date - 2023-09-17T05:28:43+05:30 IST

...అయితే మీ ఆరోగ్యానికి ఢోకా లేదంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఔషధ గుణాలు మెండుగా ఉండే కాకరకాయను తినడానికి చాలామంది ఇష్టపడరు. దీని చేదు రుచే అందుకు

 Kakarakaya : కాకర తింటున్నారా..?

...అయితే మీ ఆరోగ్యానికి ఢోకా లేదంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఔషధ గుణాలు మెండుగా ఉండే కాకరకాయను తినడానికి చాలామంది ఇష్టపడరు. దీని చేదు రుచే అందుకు కారణం. కానీ ఒక్కసారి అది శరీరానికి చేసే మేలు తెలుసుకొంటే... మీ మెనూలో కచ్చితంగా కాకరను చేరుస్తారు.

కాకరలో విటమిన్‌-సి పుష్కలం. దీనివల్ల రోగాలు దరి చేరవు. ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. గాయాలు త్వరగా మానతాయి. విటమిన్‌-ఎ కూడా అధికమొత్తంలో ఉండడంవల్ల చర్మ ఆరోగ్యం, కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఇందులో కేలరీలు తక్కువ... పీచు పదార్థం ఎక్కువ. వంద గ్రాముల కాకర తింటే మనకు రోజువారీ అవసరమైన ఫైబర్‌లో ఎనిమిది శాతం అందుతుంది. వీటితోపాటు జింక్‌, పొటాషియం, ఐరన్‌ తదితర ఖనిజాలు కూడా కాకరలో సమృద్ధిగా ఉన్నాయి.

అంతేకాదు... కాకర మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడంలో దోహదపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అయితే గర్భిణులు కాకరకు దూరంగా ఉండడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2023-09-17T05:28:43+05:30 IST