Venkatesh: వెంకీ చేతిలో మరో రీమేక్‌?

ABN , First Publish Date - 2023-03-19T00:22:30+05:30 IST

వెంకటేశ్‌ని అభిమానులు ‘రీమేక్‌ రాజా’ అని ముద్దుగా పిలుచుకొంటారు. ఎందుకంటే ఆయన కెరీర్‌లో ఎక్కువ రీమేక్‌లే కనిపిస్తాయి. వాటిలో విజయాల శాతం కూడా ఎక్కువే. తాజాగా ‘అయోతి’ అనే తమిళ చిత్రంపై వెంకీ దృష్టి పడినట్టు సమాచారం.

 Venkatesh: వెంకీ చేతిలో మరో రీమేక్‌?

వెంకటేశ్‌ని అభిమానులు ‘రీమేక్‌ రాజా’ అని ముద్దుగా పిలుచుకొంటారు. ఎందుకంటే ఆయన కెరీర్‌లో ఎక్కువ రీమేక్‌లే కనిపిస్తాయి. వాటిలో విజయాల శాతం కూడా ఎక్కువే. తాజాగా ‘అయోతి’ అనే తమిళ చిత్రంపై వెంకీ దృష్టి పడినట్టు సమాచారం. మంతిర మూర్తి దర్శకత్వం వహించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. శశి కుమార్‌ కథానాయకుడిగా నటించారు. ఈనెలలోనే విడుదలైంది. తమిళ నాట విశ్లేషకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు మంచి వసూళ్లని కూడా దక్కించుకొంది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో వెంకీతో చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇటీవల ఈ సినిమాని వెంకీ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారని, ఇందులో నటించడానికి వెంకటేశ్‌ ఆసక్తి చూపించారని తెలుస్తోంది. అయితే వెంకీ చేతిలో ఓ సినిమా ఉందిప్పుడు. ‘హిట్‌’ ఫేమ్‌ శైలేశ్‌ కొలను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి ‘సైంధవ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా పూర్తయ్యాకే మరో సినిమాని పట్టాలెక్కిస్తాడు వెంకీ. అంటే... ‘అయోతి’ సెట్స్‌పైకి వెళ్లాలంటే మరో ఆరు నెలలైనా ఆగాలి. ఈలోగా ఈ సినిమా కోసం ఓ దర్శకుడ్ని వెదికి పట్టుకోవాలి.

Updated Date - 2023-03-19T00:22:30+05:30 IST