Sai Manjrekar: సాయి మంజ్రేకర్‌కు మరో మంచి అవకాశం

ABN , First Publish Date - 2023-01-15T02:29:26+05:30 IST

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ మంచి దూకుడు మీద ఉన్నారు. ‘దృశ్యం 2’ హిట్‌ కావడం, తను నటించిన మూడు చిత్రాలు రూ 300 కోట్లకు పైగా బిజినెస్‌ చేయడంతో ఆయన కాన్ఫిడెన్స్‌ పెరిగింది.

Sai Manjrekar: సాయి మంజ్రేకర్‌కు మరో మంచి అవకాశం

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ మంచి దూకుడు మీద ఉన్నారు. ‘దృశ్యం 2’ హిట్‌ కావడం, తను నటించిన మూడు చిత్రాలు రూ 300 కోట్లకు పైగా బిజినెస్‌ చేయడంతో ఆయన కాన్ఫిడెన్స్‌ పెరిగింది. ప్రస్తుతం అజయ్‌ తను దర్శకత్వం వహిస్తున్న ‘బద్‌లా’ నిర్మాణ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. మార్చి నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ఇక కొత్త సినిమాల విషయానికి వస్తే నీరజ్‌ పాండే దర్శకత్వంలో అజయ్‌ నటించే సినిమా షూటింగ్‌ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకొనే ఈ సినిమాలో సాయి మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఇంతకుముందు ఇందులో హీరోయిన్‌ జిమ్మీ షేర్‌ గిల్‌ అని వార్తలు వినిపించాయి కానీ ఇప్పుడు ఆ ఛాన్స్‌ సాయిని వరించింది. ‘ఈ సినిమా షూటింగ్‌ ఈ నెలాఖరున లక్నోలో మొదలవుతుంది. రెండో షెడ్యూల్‌ ముంబైలో ఉంటుంది. మొత్తం 50 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేయాలని నిర్మాతల ప్లానింగ్‌. మొదట జూన్‌లో సినిమాను విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందుకే షూటింగ్‌ పూర్తయిన తర్వాత రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

Updated Date - 2023-01-15T02:29:27+05:30 IST