కురులకు ఉసిరి!

ABN , First Publish Date - 2023-05-24T23:55:10+05:30 IST

ఉసిరిపండు తింటే ఆరోగ్యానికి మంచిది. పొట్ట శుభ్రపడుతుంది. విటమిన్లు, మినరల్స్‌ ఉండే ఈ సూపర్‌ఫుడ్‌లో న్యూట్రిన్లు అధికంగా ఉంటాయుయి. చర్మ ఆరోగ్యంతో పాటు జుట్టు ఆరోగ్యానికెంతో మేలు చేస్తుంది ఉసిరి. ఇంతకీ ఉసిరితో తయారు చేసుకునే హెయిర్‌ ప్యాక్స్‌ ఏంటో చూద్దాం.

కురులకు ఉసిరి!

ఉసిరిపండు తింటే ఆరోగ్యానికి మంచిది. పొట్ట శుభ్రపడుతుంది. విటమిన్లు, మినరల్స్‌ ఉండే ఈ సూపర్‌ఫుడ్‌లో న్యూట్రిన్లు అధికంగా ఉంటాయుయి. చర్మ ఆరోగ్యంతో పాటు జుట్టు ఆరోగ్యానికెంతో మేలు చేస్తుంది ఉసిరి. ఇంతకీ ఉసిరితో తయారు చేసుకునే హెయిర్‌ ప్యాక్స్‌ ఏంటో చూద్దాం..

ఎనిమిది మీడియం సైజ్‌ ఉసిరికాయలను తీసుకుని విత్తనాలను తీసేయాలి. ఉసిరికాయల్ని ముక్కలుగా కట్‌ చేసి కాస్త నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు తాకేట్లు పట్టించి ఇరవై నిముషాల తర్వాత కడిగేస్తే సరి.. కురులు గట్టిగా తయారవుతాయి.

అరకప్పు ఉసిరిపొడి, రెండు టేబుల్‌ స్పూన్ల తేనెను బౌల్‌లో తీసుకోవాలి. ఇందులోకి కాస్త నీళ్లు కలపాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి గంటపాటు వదిలేయాలి. ఆ తర్వాత మంచి నీళ్లతో జుట్టును కడగాలి. ఇలా చేస్తుంటే చుండ్రు తగ్గిపోతుంది.

బౌల్‌లో మూడు టేబుల్‌ స్పూన్ల ఉసిరికాయల పొడిని తీసుకోవాలి. ఇందులోకి మందారంపువ్వు, మందారం ఆకులతో చేసిన పిండిని ఒక మూడు స్పూన్లు తీసుకోవాలి. నీళ్లు పోసి పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. దీన్ని పట్టిస్తే జుట్టు పొడిబారదు. థిక్‌గా ఉండటమే కాకుండా కాంతివంతంగా ఉంటుంది.

మూడు టేబుల్‌ స్పూన్ల ఉసిరికాయలపొడికి, ఒక కోడిగుడ్డు సొనను కలపాలి. బాగా మిక్స్‌ చేసిన తర్వాత కుదుళ్లకు తగిలేట్లు ఆ మిశ్రమాన్ని పట్టించి 40 నిముషాల పాటు ఆరబెట్టాలి. ఆ తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే సరి.. జుట్టు సాఫ్ట్‌గా తయారవుతుంది.

బౌల్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల ఉసిరికాయల పొడికి, మూడు టేబుల్‌ స్పూన్ల పెరుగును కలపాలి. ఈ మిశ్రమంలోని రెండు పదార్థాలు కూడా చల్లగా ఉంచుతాయి శరీరాన్ని. జుట్టుకు పట్టిస్తే మాడు చల్లగా ఉంటుంది. ఇచ్చింగ్‌, ఎర్రబడటం లాంటి సమస్యలు జుట్టులో ఉండవు.

ఎనిమిది ఉసిరికాయలను తీసుకుని విత్తనాలు తీసి చిన్నగా కట్‌ చేసుకోవాలి. వీటిని మిక్సీలో వేసి గుప్పెడు కరివేపాకులు వేయాలి. కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌ చేసుకుని మసాజ్‌ చేసినట్లు జుట్టుకు పట్టిస్తే.. డ్యామేజ్‌ అయిన కురుల కణజాలాలు మళ్లీ రిపేర్‌ అవుతాయి. దీంతో పాటు జుట్టు ఊడిపోకుండా నివారిస్తుంది.

Updated Date - 2023-05-24T23:55:10+05:30 IST