Share News

Dunky : డంకీ పైనే కళ్లన్నీ...!

ABN , First Publish Date - 2023-12-09T23:42:20+05:30 IST

ఈయేడాది షారుఖ్‌ఖాన్‌కి బాగా కలిసొచ్చింది. వరుస పరాజయాలకు బ్రేక్‌ ఇస్తూ... ‘పఠాన్‌’, ‘జవాన్‌’ సూపర్‌ హిట్లు కొట్టాయి. ఇప్పుడు ‘డంకీ’ వస్తోంది. రాజ్‌ కుమార్‌

Dunky : డంకీ పైనే కళ్లన్నీ...!

ఈయేడాది షారుఖ్‌ఖాన్‌కి బాగా కలిసొచ్చింది. వరుస పరాజయాలకు బ్రేక్‌ ఇస్తూ... ‘పఠాన్‌’, ‘జవాన్‌’ సూపర్‌ హిట్లు కొట్టాయి. ఇప్పుడు ‘డంకీ’ వస్తోంది. రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరు 21న విడుదల అవుతోంది. ‘డంకీ’ కూడా హిట్టయితే... షారుఖ్‌ హ్యాట్రిక్‌ కొట్టినట్టే. షారుఖ్‌ - రాజ్‌ కుమార్‌ల కాంబోలో రూపుదిద్దుకొన్న తొలి చిత్రమిది. రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకత్వంపై ఉన్న నమ్మకం, షారుఖ్‌ ఫామ్‌ చూస్తే... ‘డంకీ’ కూడా హిట్‌ చిత్రాల జాబితాలో చేరడం ఖాయమన్న భరోసా కలుగుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ‘డంకీ’పై మరిన్ని అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రం కోసం ఓ ప్రచార గీతాన్ని దుబాయ్‌లో తెరకెక్కించారు. తాప్సి, విక్కీ కౌశల్‌ కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2023-12-09T23:42:20+05:30 IST