Plasma Treatment : ప్లాస్మాను ఉపయోగించి వెన్నునొప్పికి కొత్త విప్లవాత్మక చికిత్స

ABN , First Publish Date - 2023-05-01T23:18:52+05:30 IST

నేటి సమాజంలో వెన్నునొప్పితో అనేక మంది వ్యక్తులు బాధపడుతున్న విషయం మనందరికీ తెలుసు. జనాభాలో దాదాపు 80 శాతం మంది ప్రజలు వెన్నునొప్పి

Plasma Treatment : ప్లాస్మాను ఉపయోగించి వెన్నునొప్పికి కొత్త విప్లవాత్మక చికిత్స

ప్లాస్మాథెరఫీ ఫౌండర్‌ డాక్టర్‌ సుధీర్‌ దారా గారి ప్లాస్మాథెరఫీ (చిన్న సూదితో) దీర్ఘకాలిక పరిష్కారం

నేటి సమాజంలో వెన్నునొప్పితో అనేక మంది వ్యక్తులు బాధపడుతున్న విషయం మనందరికీ తెలుసు. జనాభాలో దాదాపు 80 శాతం మంది ప్రజలు వెన్నునొప్పి యొక్క ‘‘డిసేబుల్‌ ఎపిసోడ్‌’’ తో బాధపడుతున్నట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి.

వెన్నునొప్పికి అనేక కారణాలు ఉంటాయని శాస్ర్తీయ అధ్యయనాలు తెలుపుతున్నాయి. స్ర్తీలలో ఆరోగ్య క్షీణత, గర్భధారణ తర్వాత కలిగే శారీరక సమస్యలు, అధిక బరువు మరియు వృద్ధాప్యం కారణాలుగా ఉన్నాయి. పురుషులలో అధిక బరువు, వృద్ధాప్యం మరియు క్రీడల వల్ల కలిగే గాయాలు వల్ల వెన్నునొప్పి కలుగుతుంది.

వెన్ను నొప్పి ఎందుకు కలుగుతుంది?

‘‘హెర్నియేటెడ్‌ డిస్క్‌ లేదా స్లిప్డ్‌ డిస్క్‌ (సయాటికా)’’ అనగా డిస్క్‌ల వెలుపలి భాగం చిరిగిపోవడం లేదా హెర్నియేట్‌ కావచ్చు. వెన్నెముక వెన్నుపూసల మధ్య ఉండే కుషన్‌ (ఈజీటఛి) దాని సాధారణ స్థానం వెలుపల విస్తరించి ఉంటుంది. ఇది వెన్నుపాము మరియు వెన్నుపూస నుండి నిష్క్రమించినప్పుడు నరాల మూలం కుదించబడుతుంది. హెర్నియేటెడ్‌ డిస్క్‌ సయాటిక్‌ నరాల మీద నొక్కితే, సయాటికా సంభవించవచ్చు. సయాటికా కాలు లేదా పాదాల నొప్పికి కారణమవుతుంది, ఇది సాధారణంగా కాలుతున్నట్లుగా లేదా తిమ్మిరిగా మరియు సూదులుగా అనిపిస్తుంది

తీవ్రమైన సందర్భాల్లో, వెన్నెముక స్టెనోసిస్‌ సంభవించవచ్చు, ఇది వెన్నెముక నరాల మీద ఒత్తిడికి దారి తీయవచ్చు.

దీని కారణంగా మీరు శరీరంలోని ఏ భాగంలో అయినా తిమ్మిరి, బలహీనత వంటి లక్షణాలను అనుభవించవచ్చు. వెన్నెముక స్టెనోసిస్‌ ఉన్న చాలా మంది వ్యక్తులు నిలబడి ఉన్నప్పుడు లేదా నడిచినప్పుడు వారి లక్షణాలు తీవ్రమవటం మనం గమనించవచ్చు.

రోగ నిర్ధారణ: చికిత్స చేసే వైద్యులు నొప్పి యొక్క స్వభావం, తీవ్రతను సేకరించేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని క్లినికల్‌ పరీక్షలను నిర్వహిస్తారు. వెన్నునొప్పిని నిర్ధారించడానికి వెన్నెముక యొక్క కఖఐ, వెన్నెముక ఎక్స్‌-రే, బోన్‌ స్కాన్‌లు, ఇఖీ స్కాన్‌లు వంటివి మరియు కొన్ని ఇతర పరీక్షలు కూడా అవసరం కావచ్చు.

దీర్ఘకాలిక నడుము నొప్పికి నాన్‌ సర్జికల్‌ రీజెనరేటివ్‌ థెరపీ అందుబాటులోకి వచ్చింది. దీర్ఘకాలిక వెన్నునొప్పికి పరిష్కారం లేదు. కానీ ‘‘ ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా’’ పిఆర్‌పి థెరపీ రూపంలో అనగా ‘‘పునరుత్పత్తి థెరపీ చికిత్సా విధానం’’ విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చింది. ఇక్కడ రోగుల రక్తాన్ని తీసుకొని వృద్ధి కారకాలను వెలికితీసి కీళ్లు, కండరాలు, డిస్క్‌ మరియు క్షీణత ఉన్న ప్రాంతంలోకి ఆ సేకరించిన కణాలను ఇంజెక్ట్‌ చేస్తారు.

పైన పేర్కొన్న అన్ని విధానాలు ఫ్లోరోస్కోపిక్‌ యంత్రాలు మరియు అల్ర్టాసౌండ్‌ మెషీన్ల వంటి ప్రత్యేక యంత్రాల మార్గదర్శకత్వంలో జరుగుతాయి కాబట్టి, లక్ష్య ప్రాంతాన్ని చాలా ఖచ్చితంగా గుర్తించి చేయడం జరుగుతుంది. దుష్ప్రభావాలు సంభవించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి ఆపరేషన్‌ థియేటర్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకొని, ప్రత్యేక యంత్రం మార్గదర్శకత్వంలో జరుపుతారు. మొత్తం ప్రక్రియకు ఇరవై నుండి ముప్పై నిమిషాలు సమయం మాత్రమే పడుతుంది. రోగిని రెండు గంటల పాటు పరిశీలనలో ఉంచి డిశ్చార్జ్‌ చేస్తారు. ఈ చికిత్స పొందిన రోగులకు ఆ తర్వాత చేయవలసిన నిర్దిష్ట వ్యాయామాలు సూచించబడతాయి. రోగులందరూ అదే రోజు నుండి వారి, వారి రోజువారీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించవచ్చు.

డాక్టర్‌ సుధీర్‌ దారా

MBBS, MD IAPM

ఫౌండర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ EPIONE,

సెంటర్‌ ఫర్‌ పెయున్‌ రిలీఫ్‌ అండ్‌ బియాండ్‌,

ఫోర్త్‌ ఫ్లోర్‌, అపురూప పిసిహెచ్‌,

రోడ్‌ నెంబరు 2,బంజారాహిల్స్‌, హైదరాబాద్‌ -33

ఫోన్‌: 875-875-875-1,8466044441,

90908 88822 చెన్నై : 76313 76313

ఇన్సురెన్స్‌ రీఇంబర్సెమెంట్‌ కలదు

Updated Date - 2023-05-01T23:18:52+05:30 IST