Ear Cleaner : చెవి శుభ్రతకు చౌకగా డివైజ్‌

ABN , First Publish Date - 2023-01-20T23:34:39+05:30 IST

మనిషికి ఉన్న ముఖ్యమైన అవయవాల్లో చెవి ఒకటి. దీన్ని శుభ్రపర్చుకునేందుకు ప్రతిసారి ఈన్‌టి డాక్టర్‌ను కలవాలంటే ఖర్చుతో కూడుకున్న పనే. అక్కడ

Ear Cleaner : చెవి శుభ్రతకు చౌకగా డివైజ్‌

మనిషికి ఉన్న ముఖ్యమైన అవయవాల్లో చెవి ఒకటి. దీన్ని శుభ్రపర్చుకునేందుకు ప్రతిసారి ఈన్‌టి డాక్టర్‌ను కలవాలంటే ఖర్చుతో కూడుకున్న పనే. అక్కడ వెయిటింగ్‌ మరో సమస్య. అదే పనిని హైజనిక్‌ పద్ధతిలో శుభ్రం చేసుకునేందుకు ఒటోస్కోప్‌ ఎక్స్‌లైఫ్‌ ఇయర్‌ క్లీనింగ్‌ డివైజ్‌ ఉపయోగపడుతుంది. 360 డిగ్రీల వ్యూతో చెవిని ఆసాంతం శుభ్రం చేసుకునే వీలు దీంతో లభిస్తుంది. దీనికి ఉన్న సిలికాన్‌ టిప్‌ గులిమి తీసేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఈ డివైజ్‌లో స్కిన్‌ ఫ్రెండ్లీ హైజెనిక్‌ స్ర్కూ ఉంది. దీనికి ఉన్న శక్తిమంతమైన కన్ను(ఐ) పరికరం తగు దూరంలో ఉండేలా చూస్తుంది. 3 మెగా పిక్సల్‌ ఐ(ఎఫ్‌హెచ్‌డీ కెమెరా). అలా్ట్ర ఐన్‌ 3.5ఎం.ఎం. లెన్స్‌ కలిసి క్లియర్‌ వ్యూని ఇస్తాయి. 2.4 జీహెచ్‌జెడ్‌ వైఫై కనెక్టివిటీకి అవకాశం ఉంది. ఫలితంగా చెవిని సులువుగా స్మార్ట్‌ఫోన్‌తో మానిటర్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ స్మార్ట్‌ఫోన్లతో ఎక్స్‌లైఫ్‌ యాప్‌తో అనుసంధానానికి అవకాశం ఉంది. ఫొటోలు తీసుకుని స్పెషలిస్ట్‌కు చూపించుకోవచ్చు. ఇంటర్నల్‌ రీచార్జబుల్‌ బ్యాటరీ బ్యాకింగ్‌ ఉంది. యుఎస్‌బి టైప్‌-సి పోర్ట్‌తో చార్జింగ్‌ చేసుకోవచ్చు. డివైజ్‌ చార్జింగ్‌ అర్ధ గంటలో పూర్తవుతుందని కంపెనీ చెబుతోంది. ఏడాది వారెంటీతో రూ.1299కి ఈ డివైజ్‌ మార్కెట్లో లభిస్తోంది.

Updated Date - 2023-01-20T23:35:30+05:30 IST