6K monitor from Dell : డెల్‌ నుంచి 6కె మానిటర్‌

ABN , First Publish Date - 2023-01-06T23:47:38+05:30 IST

డెల్‌ ప్రపంచంలోనే తొలిగా 6కె మానిటర్‌, జూమ్‌ సర్టిఫైడ్‌ కీ బోర్డ్‌ను ప్రకటించింది. 6కె రిజల్యూషన్‌ మానిటర్‌ - అలా్ట్రషార్ప్‌

6K monitor from Dell : డెల్‌ నుంచి 6కె మానిటర్‌

డెల్‌ ప్రపంచంలోనే తొలిగా 6కె మానిటర్‌, జూమ్‌ సర్టిఫైడ్‌ కీ బోర్డ్‌ను ప్రకటించింది. 6కె రిజల్యూషన్‌ మానిటర్‌ - అలా్ట్రషార్ప్‌ 32(యు3224కెబి) అలాగే డెల్టా ప్రీమియర్‌ కొలాబిరేషన్‌ కీబోర్డ్‌(కెబి900)ని సిఇసి 2023లో డెల్‌ ప్రదర్శించింది.

మానిటర్‌ విషయానికి వస్తే, ఐపీఎస్‌ బ్లాక్‌ పానల్‌ టెక్నాలజీని ఉపయోగించింది. దీంతో కాంట్రాస్ట్‌ మెరగవుతుంది. బ్లాక్‌ లెవెల్స్‌ డీప్‌గా ఉంటాయి. విండోస్‌, మేక్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో కంపాటబిలిటీ ఉంది. 4కె మానిటర్స్‌తో పోల్చుకుంటే 150 శాతం అధికంగా పిక్సెల్స్‌ను మానిటర్‌ ఆఫర్‌ చేస్తోంది. కలర్‌ ఆక్యురసీ కూడా 1.2 రెట్లు ఎక్కువ. మానిటర్‌ నుంచి రెండు రకాలుగా ప్రయోజనం అంటే ఆటో ఫ్రేమింగ్‌, లైట్‌ అడ్జస్ట్‌మెంట్‌తో హెచ్‌డిఆర్‌ 4కె వెబ్‌కామ్‌, ఆటోమేటిక్‌ సేఫ్‌ షట్టర్‌, ఎకో క్యాన్సిలేషన్‌ మైక్రోఫోన్లు అలాగే డ్యూయల్‌ 14 వాట్స్‌ స్పీకర్లు ఉన్నాయి. మానిటర్‌కు సంబంధించి డిస్‌ప్లేపోర్ట్‌ 2.1, థండర్‌బోల్ట్‌ 4 అలాగే పవర్‌ డెలివరీ 140 వాట్స్‌ వరకు ఉంది. 6కె మానిటర్‌తో పాటు అలా్ట్రషార్స్‌ 34, అలా్ట్రషార్స్‌ 43ని కూడా ప్రదర్శించింది.

మరొకటి ప్రీమియర్‌ కొలాబిరేషన్‌ కీ బోర్డ్‌. దీనికి జూమ్‌ సర్టిఫికేషన్‌ ఉంది. బూస్ట్‌ కొలాబిరేషన్‌ కోసం డిజైన్‌ చేశారు. స్లీక్‌ డిజైన్‌, జూమ్‌ కాల్స్‌ను సులువుగా కంట్రోల్‌ చేసేందుకు అవసరమైన టచ్‌ కంట్రోల్స్‌ ఉన్నాయి. మైక్రోఫోన్‌ను మ్యూట్‌/అన్‌మ్యూట్‌ చేసే వెసులుబాటు యూజర్లకు ఉంటుంది. వీడియో టోగెల్‌ ఆన్‌/ఆఫ్‌, షేర్‌ స్ర్కీన్‌ ఆప్షన్‌, చాట్‌ పానెల్‌ ఉన్నాయి. 15 ప్రోగ్రామబుల్‌ కీ లు, ఒక్క నిమిషంలోనే చార్జింగ్‌కు అవకాశంతో యూఎస్‌బీ టైప్‌-సి చార్జింగ్‌ ఉన్నాయి. పుల్‌ చార్జింగ్‌ చేస్తే 20 రోజులు ఉపయోగించుకోవచ్చు. చేతితో పట్టుకునేందుకు వీలుగా డెల్‌ ప్రీమియర్‌ రీచార్జబుల్‌ మౌస్‌(ఎంఎస్‌900) ఉంది. దీనికి పుల్‌ చార్జింగ్‌ ఒకసారి చేస్తే మూడు నెలలు ఉపయోగించుకోవచ్చు.

డెల్టా అలా్ట్రషార్ప్‌ 32 6కె మానిటర్‌(యు3224కెబి) ఈ ఏడాది మధ్య నుంచి అందుబాటులోకి రానుంది. 34 కర్వ్‌డ్‌ , 43 4కెకు తోడు కీ బోర్డులు ఈ నెలాఖరు నుంచే పొందవచ్చు.

Updated Date - 2023-01-06T23:47:39+05:30 IST