Share News

Chattisgarh: అంబులెన్స్‌లో గంజాయి తరలింపు.. 364 కిలోలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

ABN , Publish Date - Dec 21 , 2023 | 10:16 AM

మనుషుల్ని ఆపత్కాలంలో ఆదుకునే అంబులెన్స్(Ambulance)లను అసాంఘిక కార్యకలాపాలకు వాహనంగా మార్చాడు ఆ యువకుడు. ఏకంగా అంబులెన్స్ లో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు.

Chattisgarh: అంబులెన్స్‌లో గంజాయి తరలింపు.. 364 కిలోలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

రాయ్ పుర్: మనుషుల్ని ఆపత్కాలంలో ఆదుకునే అంబులెన్స్(Ambulance)లను అసాంఘిక కార్యకలాపాలకు వాహనంగా మార్చాడు ఆ యువకుడు. ఏకంగా అంబులెన్స్ లో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్ గఢ్(Chattisgarh) రాష్ట్రం సారన్ గఢ్ - బిలాయిగఢ్ జిల్లాకు చెందిన సూరజ్ ఖుటే(22) వ్యసనాలకు అలవాటుపడ్డాడు. అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు గంజాయి విక్రయాలు మొదలుపెట్టాడు.


రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ వచ్చిన డబ్బుతో విలాసాలకు అలవాటు పడ్డాడు. బుధవారం అర్ధరాత్రి ఓ అంబులెన్స్ లో 364 కిలోల గంజాయిని తరలిస్తుండగా.. రాయ్ పుర్ లో పోలీసులు తనిఖీ చేశారు. ఇంకేముంది గంజాయి గుట్టురట్టైంది. ఎవరికీ అనుమానం రాదనే ఆలోచనతో అంబులెన్స్ లో ఏళ్లుగా గంజాయి తరలిస్తున్నట్టు నిందితుడు అంగీకరించాడు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.36 లక్షలుంటుందని అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 21 , 2023 | 10:16 AM