Byjus CM Jagan: బైజూస్ కంటెంట్‌తోనే ట్యాబులు! పంపిణీ ఎప్పుడంటే..!
ABN , First Publish Date - 2023-06-24T12:22:19+05:30 IST
ఎనిమిదో తరగతి విద్యార్థులకు డిసెంబరు 21న ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నట్టు చెప్పారు. 50శాతం పాఠశాలల్లో 30, 230 తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ఇంగ్లి్‌షలో ప్రావీణ్యం పెంచే ఉద్దేశంతో టోఫెల్ పరీక్షల కోసం
డిసెంబరు 21న విద్యార్థులకు పంపిణీ: సీఎం
అమరావతి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): ఎనిమిదో తరగతి విద్యార్థులకు డిసెంబరు 21న ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నట్టు చెప్పారు. 50శాతం పాఠశాలల్లో 30, 230 తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ఇంగ్లి్‌షలో ప్రావీణ్యం పెంచే ఉద్దేశంతో టోఫెల్ పరీక్షల కోసం ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసె్‌స(ఈటీఎస్) సంస్థతో పాఠశాల విద్యాశాఖ శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచాలనే లక్ష్యంతో టోఫెల్ పరీక్షలు పాఠశాల స్థాయిలోనే ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఇది రాష్ట్ర విద్యా రంగం స్వరూపాన్నే మార్చేస్తుందన్నారు. ఈటీఎస్ తరఫున లెజో శామ్ ఊమెన్, పాఠశాల విద్యాశాఖ నుంచి సమగ్రశిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు ఒప్పందంపై సంతకాలు చేశారు.
అందరినీ క్రమబద్ధీకరించలేం!: సజ్జల
కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న లెక్చరర్లందరినీ క్రమబద్ధీకరించాలని కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా 3,600 మంది జూనియర్ లెక్చరర్లు పనిచేస్తుంటే వారిలో 1400 మందినే రెగ్యులర్ చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలోని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జూనియర్ లెక్చరర్లతో సలహాదారు సజ్జల మాట్లాడారు. ఇప్పటికే కటాఫ్ తేదీని నిర్ణయించినందున దానిని మార్చడం సాధ్యం కాదన్నారు. ఇలా నిబంధన మారిస్తే అన్ని శాఖల్లో కలిపి చాలా మంది పెరిగిపోతారని అంతమందిని రెగ్యులర్ చేయలేమని చెప్పారు. కానీ చాలా మందికి అన్యాయం జరుగుతుందని జూనియర్ లెక్చరర్లు చెప్పడంతో వారం రోజుల్లో దీనిపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల జేఏసీ చైర్మన్ కుమ్మరకుంట సురేశ్, కోచైర్మన్ కల్లూరి శ్రీనివాస్, పద్మారావు, రత్నకుమారి, దీప తదితరులు పాల్గొన్నారు.