ముఖ్యమంత్రి వరమిచ్చినా.. కౌన్సిల్‌ కనికరించడం లేదు

ABN , First Publish Date - 2023-05-31T22:20:38+05:30 IST

దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించలేదనే సామెతకు అర్థం ఇదే కాబోలు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రూ.30 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధుల(ఎస్‌డీఎఫ్‌)కు మునిసిపల్‌ కౌన్సిల్‌ రూపంలో గ్రహణం పొంచి ఉంది.

ముఖ్యమంత్రి వరమిచ్చినా.. కౌన్సిల్‌ కనికరించడం లేదు
వైరా వ్యూ

వైరా, మే 31: దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించలేదనే సామెతకు అర్థం ఇదే కాబోలు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రూ.30 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధుల(ఎస్‌డీఎఫ్‌)కు మునిసిపల్‌ కౌన్సిల్‌ రూపంలో గ్రహణం పొంచి ఉంది. ఫలితంగా రూ.30కోట్ల ఎస్‌డీఎఫ్‌ నిధులను వైరా అభివృద్ధికి వినియోగించే పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. ఈ ఏడాది జనవరి 18న కలెక్టర్‌ కార్యాలయ ప్రారంభ సభలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు అన్ని మునిసిపాలిటీల అభి వృద్ధికి ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇస్తామని ప్రకటించారు. గ్రామపంచాయతీలకు రూ.పదిలక్షలు, మునిసిపాలిటీలకు రూ.30కోట్ల చొప్పున ఎస్‌డీఎఫ్‌ నిధులిస్తామని కేసీఆర్‌ వరమిచ్చారు. అయితే వైరా మునిసిపాలిటీలో రూ.30 కోట్ల ఎస్‌డీ నిధులకు సంబంధించి ఇంతవరకు పాల కవర్గ సమావేశం ఆమోదించలేదు. దాంతో ఈ మునిసి పాలిటీ కౌన్సిల్‌ వివాదాల నేపథ్యంలో ఈ నిధులు అటకెక్కే ప్రమాదముందని ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండుసార్లు వాయిదా

వైరా మునిసిపల్‌ పాలకవర్గంలో ఆరునెలల నుంచి చో టుచేసుకున్న రాజకీయ సంక్షోభం అభివృద్ధిపై ప్రభావం చూపుతుందనే విమర్శలు విన్పిస్తోన్నాయి. ఏప్రిల్‌ 20న అ లాగే తిరిగి మే 16న నిర్వహించిన మునిసిపల్‌ పాలకవర్గ సాధారణ సమావేశాలు అర్థాంతరంగా వాయిదా పడ్డాయి. రూ.30కోట్ల ఎస్‌డీఎఫ్‌ నిధులు సహా 27అంశాలను సాధారణ సమావేశంలో చర్చించి ఆమోదించాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన మునిసిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌ ఆపార్టీ నుంచి బహిష్కరణకు గురై ఆతర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మద్దతు ప్రకటిం చిన నేపథ్యంలో పాలకవర్గంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. బీఆర్‌ఎస్‌కు చెందిన 7,8,20వ వార్డు కౌన్సిలర్లు కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి పొంగులేటికి జై కొట్టారు. దాంతో ఈ మునిసిపాలిటీలో ఇద్దరు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు సహా 14మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిల ర్లు ఒకే తాటిపై ఉన్నా రు. చైర్మన్‌ అధికార దుర్వినియోగానికి, అవినీతి అక్రమా లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పదోవార్డులో ట్యాంకు కూల్చివేతకు సంబంధించి చైర్మన్‌పై కేసు కూడా నమోదైంది. ఆకేసు, ఫిర్యాదుపై విచారణకు సంబంధించి న్యాయస్థానం ద్వారా చైర్మన్‌ ఉపశమనం పొందారు. వాయిదా పడిన రెండు సమా వేశాల్లో కూడా 27అధికారిక అంశాలతోపాటు బీఆర్‌ ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు చైర్మన్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించి తొమ్మిది తీర్మానాలను ప్రవేశపెట్టి ఆ మోదించాలని పట్టుబట్టడంతో ఈ సమావేశాలు జరుగ కుండా వాయిదా పడ్డాయి.

అదనపు కలెక్టర్‌ ఆదేశించినప్పటికీ..

వాయిదా పడిన మునిసిపల్‌ సాధారణ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వ ర్లును స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి ఆదేశించారు. ఇది జరిగి 15 రోజులవుతున్నా ఇంతవరకు అతీగతీ లేదు. ఇదే సమయంలో సాధారణ సమావేశాన్ని నిర్వహించే విషయంలో చైర్మన్‌ ఆసక్తి కనపర్చటం లేదని వివరిస్తూ అదనపు కలెక్టర్‌కు కమిషనర్‌ నివేదించినట్లు సమాచారం. అయితే ఆగస్టు వరకు ఈ సమావేశాన్ని నిర్వహించకపోయినా తనకు ఎలాంటి ఢోకా లేదని చైర్మన్‌ చెపుతున్నారనే విషయాన్ని కూడా అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అయితే ఈ సమావేశం ఎప్పుడు జరిగేది స్పష్టత కొరవడింది. చైర్మన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న నాల్గో వార్డు, ఆయనకు మద్దతుగా ఉన్న 7,8,20 వార్డుల్లో అక్కడి కౌన్సిలర్లు ప్రతిపాదించిన పనుల ను పరిగణలోకి తీసుకోవడం లేదనే ఆక్రోశంతో ఉన్నట్లు సమాచారం.

రూ.30కోట్లతో పనులకు ప్రతిపాదనలు..

రూ.30కోట్ల ఎస్‌డీ నిధులతో చేపట్టనున్న పనుల వివ రాలకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే రాములునాయక్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మొత్తం 20 వార్డులుండగా ఒక్కో వార్డులో రూ.కోటి చొప్పున సీసీ రో డ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని ప్రతిపాదించారు. అలాగే రూ.మూడుకోట్లతో సత్రంబజార్‌లో ప్రధాన డ్రెయినేజీ నిర్మాణానికి, రూ.మూడుకోట్లతో పార్కుల అభివృద్ధి, రూ.మూడు కోట్లతో డంపింగ్‌యార్డు నిర్మాణం, రూ.75 లక్షలతో లైబ్రరీ పునర్నిర్మా ణం, రూ.25లక్షలతో పలు అభి వృద్ధి పనులు చేసేందుకు ప్రతిపాదించారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన ప్రతిపాదనలకు మునిసిప ల్‌ కౌన్సిలర్‌ ఆమోదం తెలపాల్సి ఉంది. మరోవైపున ఈ ఏడాది చివర్లో సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యం లో ఆగస్టు వరకు ఈపనుల ప్రతిపాదనలకు మునిసిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలపకుంటే నిధులు మురిగిపోయే ప్రమాదముందని, తద్వారా వైరా అభివృద్ధి కుంటుపడు తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-05-31T22:20:38+05:30 IST