వైరా పురపాలకానికి ఫిబ్రవరి సంక్షోభం

ABN , First Publish Date - 2023-02-23T23:55:22+05:30 IST

రెండు సంవత్సరాల నుంచి వైరా మునిసిపాలిటీ ఫిబ్రవరి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.

వైరా పురపాలకానికి ఫిబ్రవరి సంక్షోభం
వైరా మునిసిపాలిటీ కార్యాలయం

వైరా, ఫిబ్రవరి 23: రెండు సంవత్సరాల నుంచి వైరా మునిసిపాలిటీ ఫిబ్రవరి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. గత ఏడాది ఇదేనెల ఈరోజుల్లోనే మునిసిపాలిటీ అతలాకు త లంగా ఉంది. ఇప్పుడు మళ్లీ సమస్య వేరే అయినప్పటికీ సంక్షోభం పునరావృతమైంది. బీఆర్‌ఎస్‌లో ధిక్కారస్వరం విన్పించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచ రుల్లో ఒకరిగా ఉన్న మునిసిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపా ల్‌ ఇటీవల చేసిన సవాల్‌ను బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మ కంగా తీసుకొని ఆయనపై అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది. బీఆర్‌ ఎస్‌కు చెందిన 14మంది, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు కౌన్సి లర్లు మొత్తం 16మంది సంతకాలతో చైర్మన్‌ జైపాల్‌పై అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ కలెక్టర్‌ వీపీ.గౌత మ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. 20 మంది కౌన్సిలర్లకు గానూ జైపాల్‌కు ఆయన సహా నలుగురు మాత్రమే అనుకూలం గా ఉన్నారు.

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు

అవిశ్వాస తీర్మానాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సహా ఎమ్మె ల్సీ తాతా మధుసూ దన్‌, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పొంగులే టి వెంట జైపాల్‌ను ఎలాంటి అధికారాలను చెలాయించ కుండా నామ మాత్రం చేయాల ని బీఆర్‌ఎస్‌ నాయకత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో అవిశ్వాస నోటీసులు అందుకున్న పలువురు చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించడంతో నాలుగువారాల వరకు అవిశ్వాసంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో జైపాల్‌కు కూడా ఆ వెసులుబాటు లభించే అవకాశముంది. జైపాల్‌ కు అవిశ్వాస నోటీసు అందిన వెంటనే హైకోర్టును ఆశ్రయించేందుకు ఇప్పటికే హైదరాబాద్‌లో న్యాయప రమైన ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. ఇక అవిశ్వాసంతో నిమిత్తం లేకుండా జైపాల్‌పై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ కలెక్టర్‌కు మరో ఫిర్యాదు చేసి ఆతర్వాత విచారణ చేయిం చి, వాటిని రుజువు చేయడం ద్వారా పదవిచ్యుతుడిని చేసే ఏర్పాట్లను కూడా బీఆర్‌ఎస్‌ నాయకత్వం చేపట్టింది.

ఎప్పటికి సమసిపోతుందో?

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మునిసిపల్‌ బడ్జెట్‌ సమావేశాన్ని నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదించాల్సి ఉంది. అయితే ఈ సంక్షోభం నేపథ్యంలో బడ్జెట్‌ సమావే శం, ఆమోదం సాఫీగా జరుగుతుందా లేదా అనేదానిపై చర్చ నడుస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో అనేక ఆరోపణ లు ఎదుర్కొంటున్న అప్పటి కమిషనర్‌ వెంకటస్వామిని విధుల నుంచి తొలగించారు. ఆతర్వాత బడ్జెట్‌ సమావేశం సాఫీగా జరిగింది.ఈ ఏడాది ఫిబ్రవరి మొదటివారం నుంచి రాజకీయ పరిణామాల మార్పుతో సంక్షోభం తలె త్తింది. ప్రస్తుతం ఇది బీఆర్‌ఎస్‌ నాయకత్వా నికి, పొంగు లేటికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సమస్య ఎప్పటికీ సమసిపోతుందోననే చర్చ సర్వత్రా జరుగుతోంది.

Updated Date - 2023-02-23T23:55:25+05:30 IST