ఈ వారం వివిధ కార్యక్రమాలు 26 06 2023
ABN , First Publish Date - 2023-06-26T01:03:18+05:30 IST
‘దాహం.. దాహం..’ కవిత్వ సంపుటి, బలివాడ స్మారక సాహిత్య పురస్కార సభ, కథలకు ఆహ్వానం, రావూరి భరద్వాజ, కాంతమ్మ సాహితీ పురస్కారాలు..
‘దాహం.. దాహం..’ కవిత్వ సంపుటి
పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో చిన్ని నారాయణరావు రచించిన ‘దాహం.. దాహం..’ దీర్ఘకవితా సంపుటి ఆవిష్కరణ సభ జూలై 2 సా. 6గం.లకు నెల్లూరు టౌన్‌హాలులో జరుగుతుంది. పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి, మేడిపల్లి రవి కుమార్ తదితరులు పాల్గొంటారు.
పెన్నా రచయితల సంఘం
బలివాడ స్మారక సాహిత్య పురస్కార సభ
భారత నిధి ఫౌండేషన్, విశాఖ రచయితల సంఘం నిర్వహిస్తున్న బలివాడ కాంతారావు పురస్కార సభ జూలై 3 సా.5.30ని.లకు శ్రీసుబ్బలక్ష్మీ కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, విశాఖ పట్నంలో జరుగుతుంది. సభలో బలివాడ కాంతా రావు స్మారక జీవన సాఫల్య పురస్కారాలను 2021కిగాను అట్టాడ అప్పల్నాయుడు, చాగంటి తులసి, 2022కి గాను తుర్లపాటి రాజేశ్వరి, చింతకింది శ్రీనివాసరావు స్వీకరిస్తారు.
విశాఖ రచయితల సంఘం
కథలకు ఆహ్వానం
మలిశెట్టి సీతారామ్ స్మారకార్థం నిర్వహిస్తున్న కథల పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా: రూ.5వేలు, రూ3వేలు, రూ.2వేలు. కథలను జూలై 15లోగా చిరునామా: పలమనేరు బాలాజీ, 6/219 గుడియాత్తం రోడ్, పలమనేరు 517408, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ కు పంపాలి. మరిన్ని వివరాలకు ఫోన్: 94409 95010, 93947 82540.
పలమనేరు రచయితల సంఘం
రావూరి భరద్వాజ, కాంతమ్మ సాహితీ పురస్కారాలు
రావురి భరద్వాజ స్మారక పురస్కారాన్ని ఓలేటి పార్వతీశం, రావురి కాంతమ్మ స్మారక పురస్కారాన్ని పరిమళా సోమేశ్వర్ జూలై 5 ఉ.10గం.లకు కె.వి. రమణ క్యాంపు కార్యాలయం, నఫీజ్ రెసిడెన్సీ, ఎ.సి.గార్డ్స్, హైదరాబాద్‌లో స్వీకరిస్తారు.
జివిఆర్ కల్చరల్ ఫౌండేషన్
వందేళ్ళ సంఘ్ పరివార్ ఫాసిజంపై సదస్సు
విరసం ఆవిర్భావం సందర్భంగా వందేళ్ళ సంఘ్ పరివార్ ఫాసిజంపై సదస్సు జూలై 2 ఉ.10గం.ల నుంచి సుంద రయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాదులో జరుగుతుంది. ఇందులో ‘భారత దేశ చరిత్రలో ఫాసిజం’ అంశంపై కల్లూరి భాస్కరం; ‘హిందూ రాష్ట్ర దిశగా ఫాసిజం’పై మురళీధరన్ (అజిత్), ‘సృజన మేధో రంగాలపై ఫాసిస్టుల దాడి-ఫాసిస్టు వ్యతిరేక ప్రతిఘటనా సాహిత్యం’ అంశంపై కె. శ్రీనివాస్, కాత్యాయనీ విద్మహే, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, షాజ హానా, కె.శివారెడ్డి; ‘కార్పొరేట్ ఫాసిజం-ద్రవ్య పెట్టుబడి- వైమానిక యుద్ధం’పై రివేరా మాట్లాడతారు.
అరసవిల్లి కృష్ణ
వాకాటిపై రచనలకు ఆహ్వానం
వాకాటి పాండురంగారావు గారిని గుర్తు చేసుకుంటూ ఇదివరకే వెలువడిన ఇతరుల లేదా మీ రచనలను సూచిం చడం లేదా పంపడంతోపాటు, ఇప్పుడు కొత్తగా మీ జ్ఞాప కాలనూ వారి రచనలనూ తరచి చూపే రీతిలో అర్థవంత మైన స్పందన కలిగించే వ్యాసాలను రాసి ఆగస్ట్ 15లోగా వాకాటి పి.ఆర్., 208, ఫ్లోర్ 5, లుంబిని రాక్ కాసల్ అపా ర్టుమెంట్స్, రోడ్ నం.4, బంజారాహిల్స్, హైదరాబాద్-500 003, ఈమెయిల్:ఠ్చిజ్చ్టుజీ.ఞటఃజఝ్చజీజూ.ఛిౌఝ, ఫోన్: 879 0007042కు పంపాలి.
నాగసూరి వేణుగోపాల్