ఈ వారం వివిధ కార్యక్రమాలు 25 09 2023

ABN , First Publish Date - 2023-09-25T00:31:14+05:30 IST

‘మన కాలపు జాషువా’ పురస్కారం, తెలంగాణ ‘అరసం’ మహాసభలు, ‘కండిషన్స్‌ అప్లయ్‌’ పరిచయ సభ, జయప్రద, జమున అవార్డ్స్‌...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 25 09 2023

‘మన కాలపు జాషువా’ పురస్కారం

జాషువా జయంతి సందర్భంగా జాషువా సాహిత్య వేదిక కొలకలూరి ఇనాక్‌కు ‘మన కాలపు జాషువా’ పురస్కారాన్ని సెప్టెంబరు 28న ప్రదానం చేస్తున్నది. ఖమ్మం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమంలో మంద కృష్ణ మాదిగ, జి. లక్ష్మినర్సయ్య, సి.ఖాసీం, మువ్వా శ్రీనివాసరావు, పగిడిపల్లి వెంకటేశ్వర్లు పాల్గొంటారు.

జాషువా సాహిత్య వేదిక

తెలంగాణ ‘అరసం’ మహాసభలు

తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం మూడవ మహాసభలు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో అక్టోబరు 1, 2 తేదీల్లో తెలంగాణ సారస్వత పరిషత్తు, బొగ్గులకుంట, ఎండోమెంట్‌ డిపార్టుమెంట్‌ ఎదురుగా, అబిడ్స్‌, హైదరాబాదులో జరుగుతాయి. సభల్లో కె. శ్రీనివాస్‌, పెనుగొండ లక్ష్మీనారాయణ, నందిని సిధారెడ్డి, జూలూరు గౌరీశంకర్‌, ఎన్‌. వేణుగోపాల్‌, మామిడి హరికృష్ణ, దర్భశయనం శ్రీనివాసాచార్య, ఆర్వీ రామారావు, రాపోలు సుదర్శన్‌, బొమ్మగాని నాగభూషణం తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 9676282858.

తెలంగాణ ‘అరసం’

‘కండిషన్స్‌ అప్లయ్‌’ పరిచయ సభ

పసునూరి రవీందర్‌ రచించిన ‘కండిషన్స్‌ అప్లయ్‌’ పరిచయ సభ జానుడి - సెంటర్‌ ఫర్‌ లిటరేచర్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో అక్టోబరు 1 ఉ.10గంటలకు ఒంగోలులో డాక్టర్‌ మల్లవరపు రాజేశ్వరరావు భవన్లో జరుగుతుంది. సభలో కోయి కోటేశ్వరరావు, మల్లవరపు రాజేశ్వరరావు, పాటిబండ్ల ఆనందరావు తదితరులు పాల్గొంటారు.

నూకతోటి రవికుమార్‌

జయప్రద, జమున అవార్డ్స్‌

ప్రతి ఏటా ఇస్తున్న జమున స్మారక నానీల సంపుటి అవార్డు, పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి నవలా అవార్డులకు 2022-2023 ఆగస్టు మధ్య పబ్లిష్‌ అయిన నానీల సంపుటి, నవలలు మూడు కాపీలను పంపగోరుతున్నాము. ఉత్తమ నానీల సంపుటికి రూ.10వేలు, ఉత్తమ నవలకు రూ.15వేలు బహుమతి ఉంటుంది. అక్టోబర్‌ 31 లోగా పుస్తకాలను చిరునామా: అవ్వారు శ్రీధర్‌ బాబు, 23-1-57, పెండెం వారి వీధి, ఫత్తేఖాన్‌ పేట, నెల్లూరు -524003కు పంపాలి. ఫోన్‌: 8500130770.

సోమిరెడ్డి వెంకట శేషారెడ్డి

Updated Date - 2023-09-25T00:31:14+05:30 IST