ఈ వారం వివిధ కార్యక్రమాలు 11 12 2023
ABN , First Publish Date - 2023-12-11T00:26:43+05:30 IST
తెరేష్ బాబు స్మారక సంచిక, ‘నేల లేని దేశం’ సంకలనం ఆవిష్కరణ, సాహితీ సప్తాహం, ‘తెలకోవెల’ పరిచయ సభ...
తెరేష్ బాబు స్మారక సంచిక
పైడి తెరేష్ బాబు స్మారక సంచిక కోసం మీ కవితలను వ్యాసాలను డిసెం బరు 30లోపు చిరునామా: డా.జి.వి. రత్నాకర్, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హిందీ, మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, టెలికాం నగర్, గచ్చిబౌలి, హైదరాబాద్ - 500032కు పంపాలి. ఫోన్: 70135 07228. ఈమెయిల్: drgvratnakargalla@ gmail.com
పైడి తెరేష్ బాబు మిత్రులు
‘నేల లేని దేశం’ సంకలనం ఆవిష్కరణ
పాలస్తీనాపై కవిత్వం ‘నేల లేని దేశం’ ఆవిష్కరణ సభ డిసెంబరు 13 సా.6గంటలకు దొడ్డి కొమురయ్య హాల్, సుందరయ్య భవన్, బాగ్ లింగంపల్లి, హైదరాబాదులో జరుగు తుంది. ఖాలిదా పర్వీన్, లక్ష్మీనరసయ్య, గోరటి వెంకన్న, హరగోపాల్, ఖాదర్ మొహియుద్దీన్ తదితరులు సభలో పాల్గొంటారు. కవులు కొందరు పాలస్తీనా కవిత్వం చదువుతారు.
దర్దీ పబ్లికేషన్స్
సాహితీ సప్తాహం
‘సేవ’ భాషా సాహితీ, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ‘అక్షర తోరణం’పేరిట తిరుపతి కేంద్రంగా డిసెంబరు 15 నుండి 21 దాకా ఎన్. గోపి సాహితీ సప్తాహం జరుగుతుంది. సేవ సంస్థ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమ వివరాలకు ఫోన్: 94926 66660.
కంచర్ల సుబ్బానాయుడు
‘తెలకోవెల’ పరిచయ సభ
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి కథల సంపుటి ‘తెలకోవెల’ పరిచయ సభ, రచయితతో ముఖాముఖి డిసెం బర్ 17న పలమనేరు, గంగవరం సాయి గార్డెన్ సిటీ, తెలుగు సాహిత్య సాంస్కృ తిక సమితి కళామందిరంలో జరుగు తుంది. కె.పి. అశోక్ కుమార్, రాము ఇటిక్యాల తదితరులు పాల్గొంటారు.
పలమనేరు బాలాజీ