ఈ వారం వివిధ కార్యక్రమాలు 24 07 2023
ABN , First Publish Date - 2023-07-24T04:37:52+05:30 IST
కథల పోటీ, సోమవారం కవి సమ్మేళనం, సి. నారాయణరెడ్డి కళాపీఠం పురస్కారాలు...
కథల పోటీ
బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ నిర్వహి స్తున్న పోటీకి కథలను ఆహ్వానిస్తున్నాం. 6 కథలకు ఒక్కో కథకు రూ.2000 చొప్పున బహుమతి వుంటుంది. కథలను ఆగష్ట్ 24లోగా చిరునామా: బండికల్లు జమదగ్ని, 402, హిమజ టవర్స్, 3/10 బ్రాడీపేట, గుంటూరు- 522002కు పంపాలి. మరిన్ని వివరాలకు ఫోన్ 9848264742.
బండికల్లు జమదగ్ని
సోమవారం కవి సమ్మేళనం
తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం జరిగే కవి సమ్మేళనంలో భాగంగా జూలై 24 సా.7.30 గంట లకు అంతర్జాల సమావేశం జరుగు తుంది. ఇందులో ‘కవిత్వం - నిర్మా ణం- తీరుతెన్నులు’ అంశంపై నందిని సిధారెడ్డి ప్రసంగిస్తారు.
కందుకూరిశ్రీరాములు
సి. నారాయణరెడ్డి కళాపీఠం పురస్కారాలు
సినారె 92వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారాల ప్రదానం జూలై 30 ఉ.10గంటలకు ప్రేమ్ రంగా గార్డెన్స్, గంగాపురం రోడ్, జడ్చర్లలో జరుగుతుంది. వేణు శ్రీ, రాయారావు సూర్యప్రకాశ్‌రావు ప్రత్యేక పురస్కారాలు స్వీకరి స్తారు. తెలంగాణ జిల్లాలవారీగా పురస్కార స్వీకర్తలు: గురిజాల రామశేషయ్య, మచ్చ హరిదాసు, టి.శ్రీరంగస్వామి, ఎన్.సి.హెచ్. చక్రవర్తి, పొద్దుటూరి మాధవీలత, కొరుప్రోలు మాధవరావు, ఎన్వీ రఘువీర్ ప్రతాప్, తగుళ్ళ గోపాల్, తోకల రాజేశం.
మల్లెకేడి రాములు