ఈ వారం వివిధ కార్యక్రమాలు 19 11 2023
ABN , First Publish Date - 2023-11-20T00:23:51+05:30 IST
‘ఆజాదీ’ కవితా సంపుటి ఆవిష్కరణ, సోమసుందర్ సాహితీ పురస్కార ప్రదానోత్సవం, ఖమ్మం ఈస్తటిక్స్ సాహిత్య అవార్డుల ఫలితాలు...

‘ఆజాదీ’ కవితా సంపుటి ఆవిష్కరణ
కరిపె రాజ్‌కుమార్ కవితా సంపుటి ‘ఆజాదీ’ ఆవిష్కరణ సభ నవంబర్ 26 ఉ.10.30 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో రూప్ కుమార్ డబ్బీకార్, కె. ఆనందాచారి, కాంచనపల్లి పాల్గొంటారు.
పాలపిట్ట బుక్స్
సోమసుందర్ సాహితీ పురస్కార ప్రదానోత్సవం
సోమసుందర్ 99వ జయంతి సోమసుందర్ సాహితీ పురస్కార ప్రదానోత్సవ సభ నవంబరు 24 సా.6.30 లకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. రూ.10వేల నగదుకు సోమసుందర్ నవల, కథ పురస్కారాన్ని మధురాంతకం నరేంద్ర, కవిత్వ పురస్కా రాన్ని సతీష్ చందర్ స్వీకరిస్తారు.
సోమసుందర్ లిటరరీ ట్రస్ట్
ఖమ్మం ఈస్తటిక్స్ సాహిత్య అవార్డుల ఫలితాలు
ఖమ్మం ఈస్తటిక్స్ 2023 అవార్డులలో కవిత్వ విభా గంలో వసీరా కవిత్వ సంపుటి ‘సెల్ఫీ’ రూ.40వేల బహు మతిని గెలుచుకుంది. అనిల్ డానీ ‘గాంధారి వాన’, లండ సాంబమూర్తి ‘నాలుగు రెక్కల పిట్ట’, అరుణ నారదభట్ల ‘లోపలి ముసురు’ కవిత్వ సంపుటాలు ప్రత్యేక ప్రశంసకు ఎంపికయ్యాయి. కథల విభాగంలో శ్రీ ఊహ ‘లడాయి’ కథ రూ.25వేల ప్రథమ, స్వర్ణ కిలారి ‘ఆరోతనం’ కథ రూ.15వేల ద్వితీయ, జి. ఉమా మహేశ్వర్ ‘సంభావన’ కథ రూ.10వేల తృతీయ బహు మతులను గెలుచుకున్నాయి. పెద్దింటి అశోక్ కుమార్ ‘కలలు రాలుతున్న నేల’ కథ, కుప్పిలి పద్మ ‘నా స్నేహి తురాలు’ కథ ప్రత్యేక బహుమతులకు ఎంపికయ్యాయి. ఈ ఐదు కథలతో పాటు మరో పది కథలను సాధారణ ప్రచురణకు ఎంపిక చేసి ఒక సంపుటిగా ప్రచురించా లని ఖమ్మం ఈస్తటిక్స్ కమిటీ నిర్ణయించింది. త్వరలో జరిగే కార్యక్రమంలో విజేతలకు నగదు బహుమతితో పాటు షీల్డ్ అందించనున్నారు.
రవి మారుత్