ఈ వారం వివిధ కార్యక్రమాలు 14 05 2023
ABN , First Publish Date - 2023-05-15T04:31:10+05:30 IST
కేకేఆర్ ద్వితీయ వర్ధంతి సభ, నవల ఆవిష్కరణ , ఖమ్మం ఈస్థటిక్స్ పురస్కారాలు ...
కేకేఆర్ ద్వితీయ వర్ధంతి సభ
ఆచార్య కేకే రంగనాధాచార్యులు ద్వితీయ వర్ధంతి సంస్మరణ సభ మే 15 సా.6గం.లకు దొడ్డి కొమ రయ్య హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరా బాద్‌లో జరుగుతుంది. సభలో నిఖి లేశ్వర్, ఊర్మిళా రంగనాథం, డి. చంద్ర శేఖర్‌రెడ్డి, కె. శ్రీనివాస్, పిల్లలమర్రి రాములు, రాపోతు సుదర్శన్, కె. పి. అశోక్ కుమార్, లక్షణ చక్రవర్తి, ఇంకా కేకేఆర్ విద్యార్థులు, అభిమా నులు పాల్గొంటారు.
కేకేఆర్ స్మారక సమితి
నవల ఆవిష్కరణ
గులాబీల మల్లారెడ్డి రాసిన నవల ‘ప్రేమ పవనాలు - మానవతా సౌరభాలు (క్యాంపస్‌లో సరిగమలు)’ ఆవిష్కరణ సభ రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో మే 16 మధ్యాహ్నాం 1.30 గం.లకు జరుగుతుంది. సభలో సి.ఎస్. రాంబాబు, కసిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి శ్రీదేవి, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొంటారు.
గుడిపాటి
ఖమ్మం ఈస్థటిక్స్ పురస్కారాలు
ఖమ్మం ఈస్థటిక్స్ అవార్డులకు కవితా సంపుటులు, కథలను ఆహ్వానిస్తున్నాం. కథలకు మొదటి, రెండవ, మూడవ బహు మతులు వరుసగా- రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేలు, ఉత్తమ కవితా సంపుటికి రూ.40వేల బహుమతి ఉంటాయి. కవితా సంపుటి 2022 ఏప్రిల్ - 2023 మార్చ్ నడుమ ప్రచురితమై, కనీసం 25 కవితలకు తగ్గకుండా ఉండాలి. కథలు ఈ పురస్కారం కోసమే రాసినవై ఉండాలి. కథ ప్రింట్ నాలుగు ప్రతులను, యూనికోడ్ సాఫ్ట్ కాపీని, కవితా సంపుటులు నాలుగు ప్రతులను ఆగస్ట్ 31 లోపు చిరునామా: హార్వెస్ట్ స్కూల్, 5-7-200/11, పాకబండ బజార్, ఖమ్మం-507003, ఫోన్:9849114369, ఈమెయిల్: khammamaesthetics@gmail.comకు పంపాలి.
రవి మారుత్