ఈ వారం వివిధ కార్యక్రమాలు 06 02 2023

ABN , First Publish Date - 2023-02-06T00:14:05+05:30 IST

డా. పుట్ల హేమలత స్మారక పురస్కారాలు, ‘కండీషన్స్‌ అప్లయ్‌’ కథా సంపుటి, విమల సాహితీ సమితి బహుమతి ప్రదానం,, కవితా సంపుటాలకు ఆహ్వానం, ‘సోమేపల్లి’ చిన్న కథల పోటీలు...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 06 02 2023

డా. పుట్ల హేమలత స్మారక పురస్కారాలు

2023 సంవత్సరానికి పుట్ల హేమలత స్మారక పురస్కారాన్ని ఫిబ్రవరి 9న ఆమె వర్ధంతి సంద ర్భంగా రచయిత్రి, వక్త అరుణ గోగులమండ, జర్నలిస్ట్‌ తులసి చందు స్వీకరిస్తారు.

మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య వేదిక

‘కండీషన్స్‌ అప్లయ్‌’ కథా సంపుటి

పసునూరి రవీందర్‌ కొత్త కథా సంపుటి ‘కండీషన్స్‌ అప్లయ్‌’ ఆవిష్క రణ సభ ఫిబ్రవరి 10 సా.5గం.లకు రవీంద్రభారతి, హైదరాబాదులో జరుగ నుంది. సభలో ఘంటా చక్రపాణి, కొలకలూరి ఇనాక్‌, ఎ.కె.ప్రభాకర్‌, ఖదీర్‌ బాబు, వేణు ఊడుగుల, పెద్దింటి అశోక్‌ కుమార్‌, వెల్దండి శ్రీధర్‌, అపర్ణ తోట, ఒమ్మి రమేష్‌బాబు, కె.సజయ పాల్గొం టారు. వివరాలకు: 9848799092

లిఖిత ప్రెస్‌

విమల సాహితీ సమితి బహుమతి ప్రదానం

విమల సాహితీ సమితి-పాలపిట్ట సంయుక్తంగా నిర్వహించిన గుర్రం జాషువా స్మారక కవితల పోటీలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ ఫిబ్రవరి 11 ఉ.10గం.లకు త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సభలో కొలుకలూరి ఇనాక్‌, నిఖిలేశ్వర్‌, ఏనుగు నరసింహారెడ్డి, రూప్‌కుమార్‌ డబ్బీకార్‌, జి.వి. రత్నాకర్‌, కోయి కోటేశ్వరరావు, బిక్కికృష్ణ, శైలజా మిత్ర మొదలయినవారు పాల్గొంటారు. కవులు తమ కవితలని వినిపిస్తారు.

జె. విద్యాదర్‌ రావు

కవితా సంపుటాలకు ఆహ్వానం

‘వెన్నెల సాహితీ పురస్కారం’ కోసం 2022లో ప్రచురించిన వచన కవితా సంపుటాలు 4 ప్రతు లను ఫిబ్రవరి 28లోపు పంపాల్సిన చిరునామా: కొండి మల్లారెడ్డి, ఇం.నెం.19-61/5/సి, విద్యా నగర్‌, రోడ్‌.నెం.3, మిలన్‌ గార్డెన్‌ రోడ్‌, కుశాల్‌ నగర్‌, సిద్దిపేట -502103. వివరాలకు ఫోన్‌: 9652199182. సిద్దిపేటలో జరిగే కార్యక్రమంలో పురస్కారం అందజేస్తారు.

పర్కపెల్లి యాదగిరి

‘సోమేపల్లి’ చిన్న కథల పోటీలు

‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న చిన్న కథల పోటీలకు కథలు ఆహ్వానిస్తున్నాం. అత్యుత్తమ, ఉత్తమ, మంచి కథలకు వరుసగా: రూ.2500, రూ.1500, రూ.1000 బహుమతులు. ఇద్దరికి రూ.500 చొప్పున ప్రత్యేక బహుమతులు. కథల నిడివి రాత ప్రతిలో రెండు నుంచి 4 పేజీలలోపు, డి.టి.పిలోనైతే 2 పుటలు కాగితం ఒక ప్రక్కనే రాయాలి. కథలను ఫిబ్రవరి 28వ తేదీలోపు పంపాల్సిన చిరు నామా: రమ్యభారతి, పి.బి.నెం.5, 11-57/1-32, జె.ఆర్‌.కాంప్లెక్స్‌, రెండవ అంతస్తు, రజక వీధి, విజయవాడ- 520001. ఫోన్‌ :9247475975.

చలపాక ప్రకాష్‌

Updated Date - 2023-02-06T00:14:07+05:30 IST