ఈ వారం వివిధ కార్యక్రమాలు 03 04 2023
ABN , First Publish Date - 2023-04-03T01:10:33+05:30 IST
అభినందన చర్చ, పురస్కార ప్రదానం, వి. చంద్రశేఖరరావు సాహిత్య పురస్కారం, ఉమ్మడిశెట్టి అవార్డు ప్రదాన సభ...
అభినందన చర్చ
సృజన సాహితి- నల్లగొండ ఆధ్వర్యంలో ఏనుగు నరసింహారెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన కవిత్వంతో అభినందన చర్చ ఏప్రిల్ 6 సా.6గం. లకు జూమ్ వేదికగా జరుగుతుంది. పెరుమాళ్ళ ఆనంద్ అధ్యక్షతన జరిగే ఈ చర్చలో నాళేశ్వరం శంకరం, ఎం. నారాయణశర్మ, రాపోలు సీతారా మరాజు తదితరులు ప్రసంగిస్తారు.
మండల స్వామి
పురస్కార ప్రదానం
‘జయమిత్ర’ సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వ ర్యంలో జి. చెన్నకేశవరెడ్డి జన్మదినం సందర్భంగా రచయిత ఎలనాగకు పురస్కార ప్రదానం ఏప్రిల్ 7 ఉ.11గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్ లో జరుగుతుంది. సభలో ఏనుగు నరసింహారెడ్డి, సి.మృణాళిని, అమ్మంగి వేణుగోపాల్, వెలుదండ నిత్యానందరావు, గంటా జలంధర్ రెడ్డి తదిత రులు పాల్గొంటారు.
అమ్మంగి వేణుగోపాల్
వి. చంద్రశేఖరరావు సాహిత్య పురస్కారం
ఏప్రిల్ 13 వి. చంద్రశేఖరరావు జయంతి సంద ర్భంగా ప్రతి ఏటా వర్ధమాన సాహిత్యకారునికి ఇచ్చే పేరున సాహిత్య పురస్కారాన్ని 2023 సంవత్సరానికిగాను నల్గొండకు చెందిన వి. మల్లిఖార్జున్ స్వీకరిస్తారు.
వి. ప్రసూన
ఉమ్మడిశెట్టి అవార్డు ప్రదాన సభ
35వ ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు ప్రదాన సభ ఏప్రిల్ 9న అనంతపురంలో జరు గుతుంది. సభలో వసీరా అవార్డును స్వీకరి స్తారు. రాధేయ పుస్తకం ‘సాంత్వనం’ ఆవిష్క రణ ఉంటుంది. ముఖ్య అతిథి కొప్పర్తి వెంకట రమణ మూర్తి. ఈ సభలోనే కవయిత్రులు భారతి కోడె, వాణి కొరటమద్ది, గీతా వెల్లంకి, జంగం స్వయం ప్రభ, యువ దర్శకుడు రవీంద్ర సూరి నామాలకు ఆత్మీయ సత్కారాలు ఉంటాయి.
ఉమ్మడిశెట్టి రాధేయ
కవితలకు ఆహ్వానం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వజ్రోత్సవ సప్తాహం ఏప్రిల్ 23 నుంచి 30 వరకు జరుగనుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 25న పాఠశాల ప్రాంగణంలో కవి సమ్మేళనం ఉంటుంది. ఆసక్తి కలిగిన పూర్వ విద్యార్థులు ఏప్రిల్ 10 లోగా తమ కవితలను 9440763479 వాట్సాప్ నంబరుకు గానీ, annavaramdev@gmail.com మెయిల్ ఐడీకి గానీ పంపించాలి. ఏప్రిల్ 25న ఆ కవితలతో కూడిన సంకలనం విడుదల అవుతుంది.
అన్నవరం దేవేందర్