ఈ వారం కథలు, కవితల పోటీలు 06 02 2023

ABN , First Publish Date - 2023-02-06T00:17:34+05:30 IST

కథలు, కవితల పోటీ, కథా సంపుటాలకు ఆహ్వానం...

ఈ వారం కథలు, కవితల పోటీలు 06 02 2023

కథలు, కవితల పోటీ

శ్రీశైల సాంస్కృతిక సమాఖ్య, అట్లాంటా ఏకాదశ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న పోటీకి కథలు, కవితలను ఆహ్వానిస్తు న్నాం. కథలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరు సగా: రూ.30వేలు, రూ.25వేలు, రూ.20వేలు. కథలు ప్రత్యేకించి ఈ పోటీ కొరకు వ్రాసినవై వుండాలి. కథ నిడివి ఎ4 లో ఆరు పేజీలు మించరాదు. కవిత లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా: రూ.15 వేలు, రూ.12వేలు, రూ.10వేలు. కవిత ఈ పోటీ కొరకు వ్రాసినదై వుండాలి. వస్తువులో, విధానంలో ఆధునికత ఉండాలి. ఫొటోలు తీసి పెట్టరాదు. మీ రచనలు మార్చి 1 లోపు ఈమెయిల్‌: srisailaputrinadh@gmail.comకు పంపాలి. ఉత్తర ప్రత్యు త్తరాలకు తావు లేదు.

ఎస్‌.ఎస్‌.ఆర్‌ త్రినాధ రావు

కథా సంపుటాలకు ఆహ్వానం

సంకటి మహేశ్వరయ్య పేరుతో ప్రతి ఏడు మహేశ్వరయ్య స్మారక సాహిత్య పురస్కారాన్ని సాహితీ స్రవంతి జిల్లా కమిటీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పురస్కారా నికి 2022 జనవరి నుంచి 2022 డిసెంబర్‌ లోపు వెలువడిన కథా సంపుటాలు మూడు ప్రతులను మార్చి 15లోగా పంపాలి. ఎంపి కైనవారికి రూ.5వేల నగదు పారితోషికంతో పాటు, జ్ఞాపికతో సత్కారం ఉంటుంది. పంపాల్సిన చిరునామా: కెంగార మోహన్‌, ఇ.నెం.43-238, ఫ్లాట్‌ నెం:102, ఎన్వీఆర్‌ ప్లాజా, రోడ్‌ నెం. 8 ఎన్‌.ఆర్‌ పేట, కర్నూలు-518 004. వివరాలకు ఫోన్‌: 94933 75447. పురస్కారాన్ని ఏప్రిల్‌ 27న కర్నూల్లో జరిగే మహేశ్వ రయ్య ద్వితీయ వర్ధంతి సభలో అందిస్తారు.

కెంగార మోహన్‌

Updated Date - 2023-02-06T00:17:36+05:30 IST