Share News

మంట మామూలే!

ABN , First Publish Date - 2023-11-30T01:15:24+05:30 IST

ప్రజలను  అనుమానించొద్దు. అవమానించొద్దు నిలదీయొద్దు. నిందించొద్దు. ఒక్క వేలు ప్రజల వైపు చూపిస్తే నాలుగు వేళ్ళు మన వైపే వున్నాయి...

మంట మామూలే!

ప్రజలను 

అనుమానించొద్దు.

అవమానించొద్దు

నిలదీయొద్దు.

నిందించొద్దు.

ఒక్క వేలు ప్రజల వైపు చూపిస్తే

నాలుగు వేళ్ళు మన వైపే వున్నాయి.

నూటొక్క కారణాల్లో వంద మన వైపే.

నుయ్యు గొయ్యి ఆటాడిస్తున్నాం.

పెనం మీద నుంచి పొయ్యిలోకో

పొయ్యిలో నుంచి పేనం మీదకో

పెనం మీదనో పొయ్యిలోనో

తిరగేసుకోవడమో..

మొత్తానికి మంట మాములే!

ఒళ్ళు అప్పగించి

కళ్ళు మూసుకుని

పళ్ళు ఇకిలిస్తూ

అయిదేండ్ల మైల గుడ్డను

ఉతికి ఆరేసుకోవడమో

పాతది పారేసుకోవడమో

మళ్ళీ అయిదేండ్ల తండ్లాటకు

తడిగుడ్డతో గొంతులు కోసుకోవడమే.

వేనేపల్లి పాండురంగారావు

‘మట్టి మనిషి’

Updated Date - 2023-11-30T01:15:27+05:30 IST