పిచ్చి మొక్కలు, కంప చెట్లు
ABN , First Publish Date - 2023-04-03T22:51:57+05:30 IST
మల్లవరంలోని ఎన్‌పీడీసీఎల్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణం కంపచెట్లు, పిచ్చిమొక్కలతో చిట్టడివిని తలపిస్తోంది.
తల్లాడ, ఏప్రిల్ 3: మల్లవరంలోని ఎన్‌పీడీసీఎల్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణం కంపచెట్లు, పిచ్చిమొక్కలతో చిట్టడివిని తలపిస్తోంది. కంపచెట్లు ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కల పొదల్లో స్థావరం ఏర్పాటుచేసుకున్న పందులు మృతి చెందాయి. వాటి కళేబరాల వల్ల వచ్చే దుర్గంధంతో సమీప ప్రాంత ప్రజలు తల్లడిల్లుతున్నారు. చనిపోయిన పందుల శరీర భాగాలను తినేందుకు వీధికుక్కలు యథేచ్ఛగా సంచరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అపరిశుభ్ర వాతావరణం వల్ల ప్లూ జ్వరాలు వ్యాప్తిచెందే ప్రమాదం పొంచి ఉంది. 1976లో మల్లవరం గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ కోసం ఏడెకరాల స్థలాన్ని కేటాయించారు. అందులో ప్రస్తుతం రెండెకరాల విస్తీర్ణంలో సబ్‌స్టేషన్, ఏడీఈ కార్యాలయం శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లు ఉన్నాయి. మరో ఎకరం స్థలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం నిర్మించారు. మిగిలిన నాలుగెకరాల స్థలం ఖాళీగా ఉంది. దీంతో స్థలంలో తుమ్మా, కరకంప, జిల్లేడు, వివిధ రకాల పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ముళ్లపొదల్లో పందులు స్థావరం ఏర్పాటు చేసుకున్నాయి. ఇటీవల పందులు మృత్యువాతపడి దుర్గం దం వెదజల్లుతుండటంతో సమీప ప్రాంత ప్రజలు నరకయాతన పడుతు న్నారు. పందుల శరీర భాగాలను తినేందుకు వీధికుక్కలు వస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సబ్‌స్టేషన్ ఆవరణం చిట్టడివిలా ఉండటంతో తరచూ విషసర్పాలు కూడా సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దుర్గంధంతో తల్లడిల్లుతున్నాం
దుప్పటి రాము, ఒకటోవార్డు, మల్లవరం
సబ్‌స్టేషన్ ఆవరణంలోని పొదల్లో స్థావరం ఏర్పర్చుకున్న పందులు చనిపోయి వాటిని బయటకు తీసే పరిస్థితి లేకపోవడంతో దుర్గంధం వెద జల్లుతోంది. రోజులతరబడి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. పాములు, తేళ్లు వంటి విషసర్పాలు సంచరిస్తున్నాయి.
చర్యలు తీసుకోవాలి.
దుగ్గిదేవర లక్ష్మీ, 9వ వార్డుమెంబర్, మల్లవరం
చిట్టడివిలా ఉన్న సబ్‌స్టేషన్ ఆవరణాన్ని పరిశుభ్రం చేసేందుకు ఎన్‌పీ డీసీఎల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. పిచ్చిమొక్కలు, కంపచెట్లు దట్టంగా పెరిగి పందులు, కుక్కలు, పాములు వంటివి సంచరించడం వల్ల ప్రమాదం పొంచి ఉంది.